వైరల్: ఓవర్‌ లోడ్‌ స్కూటర్‌.. నెటిజన్ల ఓవర్ రియాక్షన్.. పోలీసుల రియాక్షన్ ఇదే?

సోషల్ మీడియా పరిధి ఓ మహా సముద్రంలాగా పెరిగిపోతోంది.దాంతో కొన్ని వేల వీడియోలు నెటిజన్లు రోజూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 Viral  Overloaded Scooter  Overreaction Of Netizens Is This The Reaction Of The-TeluguStop.com

ఈ క్రమంలో కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ మధ్య ఓ మహానుభావుడు సుమారు 7 మందిని(ఫ్యామిలీ) తన బైక్ పై కూర్చోబెట్టుకున్న వైరల్ వీడియోని మనం చూసాం.

ఇక ఈ ఘటన మరువక ముందే మరో ప్రబుద్ధుడు తన స్కూటర్‌ పై ఏకంగా ఓ పది రకాల సంచుల బరువుని ఎక్కించుకొని స్కూటర్ చివరలో (రెడ్ లైట్ పైన) కూర్చొని వేలాడుతూ తాపీగా డ్రైవ్ చేస్తున్న ఘటన నెటిజన్లను తీవ్రంగా ఆకర్షిస్తోంది.

99.99% స్కూటర్ ని లగేజ్ తో నింపేసి, పాయింట్‌ వన్‌ పర్సెంట్‌ సీటు మీద మాత్రమే తాను కూర్చొని, ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవింగ్‌ చేస్తున్న సదరు వీడియోని చూసినట్లయితే, అది కత్తిమీద సాములాంటిది అని అనిపించకమానదు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

దానికి ఒక నెటిజన్‌ పెట్టిన క్యాప్షన్‌ గురించి ఇక్కడ చెప్పుకోవాలి.ఈ స్కూటర్‌ని చూస్తుంటే 32 జీబీల మెమొరీ కలిగిన తన మొబైల్‌ ఫోన్‌లో 31.9 శాతం డేటా ఫుల్‌ అయినట్లుగా ఉందనే ఫన్నీ కామెంట్‌ పెట్టాడు.

ఇక ఈ పోస్టు తెలంగాణ పోలీసు విభాగం దృష్టికి రావటంతో వాళ్లు రీట్వీట్‌ చేయగా అది కాస్త వెలుగు చూసింది.ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వాహనదారులకు ఒక విలువైన సలహా ఇవ్వడం కొసమెరుపు.“మొబైల్‌లో డేటా పోతే తిరిగి తెచ్చుకోవచ్చు.ఫోన్‌ డ్యామేజ్‌ అయినా బాగు చేసుకోవచ్చు.కానీ.లైఫ్‌ ఒక్కసారి లాసైతే మళ్లీ పొందలేం.కాబట్టి ప్రజలు తమ ప్రాణాలకు తెగించి ప్రమాదకరంగా ప్రవర్తించొద్దు.

ఇదే మా హృదయపూర్వక మనవి!” అని సలహా ఇచ్చారు.ఈ వీడియోని ఎక్కడ చిత్రీకరించారో తెలియదు గానీ.

మీరు ఒకసారి చూసి చెప్పండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube