ఇటీవల స్టార్ట్ అయిన అన్నా కాంటీన్ పై ఏమని స్పందించారో తెలుసా.? ఆయన పంపిన మెసేజ్ ఇదే.!

అన్న కాంటీన్లు రన్ చేయడానికి 2018-19 బడ్జెట్ లో పెట్టింది 200 కోట్లు ఆ డబ్బులతోనే కాంటీను కన్స్ట్రక్షన్, ఉద్యోగస్తులకు జీతాలు, ఆహారం మీద సబ్సిడీ ఇవ్వబడుతుంది.

 Viral Message About Chandrababu Anna Canteen-TeluguStop.com

మొన్న ఓపెన్ చేసిన 100 కాంటీన్లకు 200 కోట్లు ఖర్చు పెట్టారు అనేది అవాస్తవం.

హైదరాబాద్ కాంటీన్లతో కంపేర్ చేస్తున్నారు అన్న కాంటీన్స్ని కానీ హైద్రాబాద్లో ఉన్న కాంటీన్స్ మెయిన్ రోడ్ మీద పొల్యూషన్ వెదజల్లే ప్రాంతాల్లో దుర్గంధం వస్తున్న ప్రాతాల్లో ఉన్నాయి.వర్షం వచ్చిన, ఎండా ఎక్కువ ఉన్న నుంచొని తినలేని పరిస్థితి.

హైదరాబాద్లో కూడా ఒక కాంటీన్ 300 మందికి మాత్రమే పెడుతుంది.ఆంధ్రా లో కూడా మొదటి రోజు 300 మందికి పెట్టడం జరిగింది, విపరీతంగా జనం రావడం తో రెండో రోజు 500 మందికి ,మూడో రోజు 700 మందికి పెంచడం జరిగిందీ.తెలంగాణాలో కేవలం హైదరాబాద్ లో మాత్రమే పెడుతున్నారు అవి కూడా హైదరాబాద్ కార్పొరేషన్ డబ్బులతో , ఆంధ్రాలో రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీస్ ,కార్పొరేషన్స్ లో ప్రభుత్వ ఖజానా నుండి పెడుతున్నారు.తెలంగాణలో హాట్ బాక్స్ సౌకర్యం లేదు,ఆంధ్రాలో వేడి వేడి అన్నం హాట్ బాక్స్ లో పెట్టి పెడుతున్నారు.

మినరల్ వాటర్ ,CC కెమెరాలు, ac సౌకర్యం ఉంది.పేదవాడు తింటాడు కాబట్టి రోడ్ల పక్కన మూత్ర విసర్జన చేసే స్థలాల్లో పెట్టి తినమంటే ఎలా తినగలరు.

పధకం పెట్టి ఇప్పటికి మూడు రోజులు,రోజుకి 2.5 లక్షలు టార్గెట్ పెట్టుకుంటే వస్తున్న వారి సంఖ్య 3 లక్షల వరకు ఉంది అంటే పధకం జనానికి బాగా ఉపయోగపడుతుంది అని అర్ధం అవుతుంది.తెలంగాణాలో 12 నుండి 1 వరకూ ఒక గంట మాత్రమే పెడతారు అది కూడా ఒక్క పూట మాత్రమే.ఆంధ్రాలో అల్పాహారం, రెండూ పూటల భోజనం పెడుతున్నారు.

టైమింగ్స్ కూడా చాలా ఎక్కువ సేపు ఉదయం 7 నుండి 9:30 వరకూ, మధ్యాహ్నం 12 నుండి 3 వరకూ, రాత్రి 7:30 నుండి 9:30 వరకూ.ఆహార కొరత కేవలం మధ్యాహ్నం భోజనం సమయంలో మాత్రమే ఉంటుంది.

అల్పాహారం ,రాత్రి భోజనం అందరికి అందుతుంది.ఎంత మంది వస్తారో సరిగా అంచనా వేయలేకపోవడం వలన ఇలా జరుగుతుంది.

నిన్న 700 మంది వచ్చారు అని ఈరోజు మళ్ళి అంత మందికి తయారు చేసి చివరకి 500 మంది మాత్రమే వస్తే ఆహారం వృధా అయ్యే అవకాశం ఉంది.

ఇది పేదవాళ్లకు,అనాధలకు,రోజు గడవడం కస్టమయ్యే నిరుపేదలకు, బిక్షాటన చేసుకుంటూ ఉన్నవాళ్ళని ఉద్దేశించి పెట్టిన పధకం కానీ కార్లు, బైకులు వెస్కొని వచ్చి చాలా మంది తింటున్నారు దీని వల్ల దక్కాల్సిన వారికీ పధకం కొంత మేర దూరం అవుతుంది.

సామాజిక బ్యాధ్యతతో అందరూ ఉండాలి నిజమైన అర్హులకు దక్కేలా చూడాల్సిన బాధ్యత మన అందరీ మీద ఉంది అది పార్టీలకు అతీతంగా జరగాలి ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని కులాలు మతాలు ఉన్నా అందరికీ ఆకలి ఒక్కటే పేదవాడు తన పొట్ట నింపడానికి తలా ఒక చెయ్యి వేయండి అంతే కాని వాడి చెయ్యి నరకకండి.తప్పులు ఉంటే సలహాలు సూచనలు ప్రభుత్వానికి తెలియజేయండి తప్పక సమీక్షించుకుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube