వైరల్: ఆన్లైన్లో కావలసినది ఆర్డర్ చేసాడు.. ఇంటికొచ్చిన పార్శిల్ చూసి కళ్ళుతిరిగి పడిపోయాడు!

ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది అక్షరాలా నిజం.అతనికి బాగా ఆకలి వేయడంతో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు.

 Viral Iguanas And Lizards Delivered To The Wrong Address Details, Online Shoppin-TeluguStop.com

కట్ చేస్తే, డెలివరీ ఓపెన్ చేసి చూసి, కళ్ళుతిరిగి పడిపోయాడు.ఈ వింత అనుభవం యెక్కడ జరిగిందో తెలియాలంటే, మీరు ఈ కధనం చదవాల్సిందే.

అమెరికాలోని న్యూయార్క్ పోలీసులకు ఎప్పటిలాగే ఓ ఫోన్ కాల్ వచ్చింది.స్థానికంగా ఉండే ఓ వ్యక్తి.

తన ఇంటికి సరీసృపాల బాక్స్ వచ్చిందంటూ భయపడుతూ ఆ ఫోన్ కాల్ లో చెప్పాడు.దాంతో పోలీసులు ఆ ఇంటికి వెళ్లి చూడగా.

బల్లులు, ఇగువానాలు నిండిన ఓ బాక్స్ కనిపించింది.

వాటిని చూసి ఆ ఇంట్లో నివాసముంటున్న వ్యక్తి.

భయంతో వణికిపోవడం ఆ పోలీసులు గమనించారు.ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను పోర్ట్ చెస్టర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.అది కాస్తా నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది.‘సరీసృపాలు నిండిన పార్శిల్ బాక్స్ అనుకోకుండా తప్పు అడ్రస్‌కు డెలివరీ అయింది.ఆ బాక్స్ ఓపెన్ చేసి.వాటిని చూడగానే ఇంటి యజమాని భయంతో వణికిపోయాడు’ అని PCPD తన పోస్ట్ లో పేర్కొంది.

Telugu Iguanas Lizards, Parcel, Port Chester, Latest-Latest News - Telugu

కాగా, ఈ వ్యవహారంపై పోర్ట్ చెస్టర్ పోలీసులు విచారణ మొదలు పెట్టారు.అన్యదేశ పెంపుడు జంతువుల వ్యాపారం ద్వారా అమెరికాలోని ఇవి అక్రమంగా రవాణా చేయబడ్డాయా? ఎవరు వీటిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారు? అక్రమ రవాణా జరుగుతున్నట్లయితే.ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.ఆ సరీసృపాలన్నింటినీ పోలీసులు పట్టుకుని.

జాగ్రత్తగా బాక్స్‌లో బంధించారు.వాటిని స్థానిక యానిమల్ షెల్టర్‌ నిర్వాహకులకు స్వాధీనం చేసేందుకు.

ఆయా షెల్టర్ యజమానులతో సంప్రదింపులు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube