మన తెలుగు సినిమాలలో ఎక్కువగా హీరో డామినేషన్ కనిపిస్తూ ఉంటుంది.ఇది కేవలం పబ్లిసిటీ వరకు మాత్రమే కాదు రెమ్యునరేషన్ లో కూడా హీరోలకే సింహభాగం వెళ్తుంది.
తర్వాత హీరోయిన్, విలన్, క్యారెక్టర్ నటీనటులకు వారి వారి క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు.అయితే ఇది అందరి విషయంలో ఒకటి కాదు అని నిరూపించిన దర్శకుడు తేజ. ఆయన తన సినిమాలో నటించే నటీనటుల విషయంలో అందరికీ ఒకే రూల్ పాటిస్తూ ఉంటాడు.తన సినిమాలో ఎవరు నటించినా కూడా అందరికీ ఒకే పారితోషకం ఉంటుంది.
మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తేజ సినిమాలో ఎక్కువ శాతం కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తూ ఉంటారు.
అయితే తన సినిమాలో నటించి అందరికీ ఒకే రెమ్యూనరేషన్ ఇవ్వడం దర్శకుడు తేజ కి ఒక సెంటిమెంట్.ఎంత స్టార్ హీరో అయినా లేదంటే కొత్తగా వచ్చిన హీరో అయినా కేవలం 11000 మాత్రమే ఇస్తాడు.
ఈ విషయం బయట పెట్టింది కమెడియన్ సుమన్ శెట్టి. తను తేజ తో చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాల్లో కమీడియన్ గా నవ్వించాడు.
ఈ సినిమాల్లో అందరికీ రెమ్యూనరేషన్ ఒకేలా ఉండేది చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ కి అలాగే హీరోయిన్ రీమాసేన్ కి కమీడియన్ సుమన్ శెట్టికి అందరికీ ఒకేలా 11000 రెమ్యునరేషన్ ఇచ్చాడట.

కేవలం ఈ సినిమా మాత్రమే కాదు జయం సినిమాలో నితిన్ కి, సదా కి, సుమన్ శెట్టి కి, గోపీచంద్ కి కూడా ఒకేలా 11000 రెమ్యునరేషన్ ఇచ్చి తన సెంటిమెంట్ నీ కంటిన్యూ చేశాడు.నువ్వు నేను సినిమాలో సైతం హీరోయిన్ అనిత కి, కమెడియన్ సుమని శెట్టి కి, హీరో ఉదయ్ కిరణ్ కి సైతం 11000 మాత్రమే ఇచ్చి తన ముందు ఎవ్వరూ ఎక్కువ కాదు అని మరోసారి నిరూపించాడు.అయితే ఇటీవల కాలంలో ఆ పద్ధతికి చరమాంకం పాడిన తేజ కాజల్ అగర్వాల్ నటించిన సీత సినిమాలో ఆమెకు దాదాపు రెండు కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇచ్చాడట.
మరి రానున్న కాలంలో ఈ పద్ధతి కంటిన్యూ అవుతుందా లేదో వేచి చూడాల్సిందే.







