స్టార్ హీరోయిన్ సమంత సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.తనను దారుణంగా ట్రోల్ చేసినా సమంత కూల్ గా రిప్లై ఇవ్వడానికి ఇష్టపడతారు.
అయితే నరేంద్ర మోదీ వల్ల సమంతను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.గతంలో పలు సందర్భాల్లో మోదీ పాలనను మెచ్చుకుంటూ సమంత కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారని సమాచారం అందుతోంది.
ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ రేట్లు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ రేటు 1100 రూపాయలకు అటూఇటుగా ఉంది.
మోదీ సర్కార్ ధరల నియంత్రణ దిశగా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చాలామంది అనుకుంటున్నారు.గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని స్థాయిలో పెరగడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
అయితే ఒక సందర్భంలో “నేను ఎల్లప్పుడూ మోదీజీ సపోర్టర్ నే.ఆయన చేసే మంచి కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నాను” అని సమంత చెప్పుకొచ్చారు.
మరో సందర్భంలో సమంత నేను మోదీ సపోర్టర్ నని ఆయన నాయకత్వంలో కచ్చితంగా మార్పు వస్తుందని నమ్ముతున్నానని తెలిపారు.మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆర్థిక వ్యవస్థలో మార్పులు తెస్తారని సమంత కామెంట్లు చేశారు.
అయితే మోదీ వ్యతిరేకులు ఆర్థిక వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా అంటూ గ్యాస్ సిలిండర్ రేట్ల గురించి ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆ సినిమాలతో సమంత కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.ఈ ఏడాదే సమంత నటించిన మూడు సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.సమంత భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.