వైరల్: అందులో గెలిస్తే.. విడాకులు ఫ్రీ..!

సహజంగా భార్య భర్తలు ఎవరైనా విడాకులు తీసుకోవాలి అనుకుంటే లాయర్లను సంప్రదించి తగిన కారణాలను చెప్పి విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ ఆ లాయర్లు వారు విడిపోవడానికి గల కారణాలు తెలుసుకొని వారికి తగిన కౌన్సెలింగ్ ఇచ్చి విడాకులు తీసుకోకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఒకవేళ వారు వినని పరిస్థితిలో కోర్టు వారికి విడాకులు తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది.కానీ, ఓ సంస్థ వారు మాత్రం ఒక  గేమ్ లో గెలిస్తే విడాకులు ఫ్రీగా ఇస్తామని తెలపడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

ఎవరైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా కానీ, వారిద్దరూ కలిసి జీవించలేము అని అనుకున్న వారు కానీ వారికి విడాకులు ఉచితంగా ఇస్తామని ప్రకటన చేసింది.ఇంతకీ కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు అని అనుకుంటున్నారా.

Powers Law Firm in Crossville అనే వారు ఈ కాంటెస్ట్ ఏర్పాటు చేసింది.పోటీలలో గెలిచిన వారికి ఉచితంగా విడాకులు ఇస్తామని, అంతేకాకుండా విడాకులు తీసుకునేందుకు కోర్టుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా తామే భరిస్తామని తెలియజేస్తుంది.

Advertisement

ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆ సంస్థ పోస్ట్ చేసింది.ఆ వైరస్ కారణంగా అనేకమంది ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగతంగా అనేక కష్టాలు పాలయ్యారని ఆ సంస్థ పేర్కొంది .భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించాలి లేకపోగా విడాకులు తీసుకోవడానికి ఆర్థిక పరంగా కొంత మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సంస్థ తెలియజేసింది.

ఇంతకీ ఆ కాంటెస్ట్ లో పాల్గొనడానికి ఏం చేయాలని అనుకుంటున్నారా.? ఐతే ఇలా ఫాలో అయిపోండి.ముందుగా ఎందుకు విడిపోతున్నారో  పూర్తి వివరాలను ఆ సంస్థ వారికి మెయిల్ చేయవలసి ఉంటుంది.

ఆ మెయిల్ ఫిబ్రవరి 15 న నుంచి చేయాలి, ఫిబ్రవరి 19 నాటికి విన్నర్ ను ఎంపిక చేసి వారు ప్రకటిస్తారు.అలాగే చట్టపరంగా భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయేందుకు అంగీకరించాల్సి ఉంటుంది.

ఇలా అంగీకరించిన అనంతరం విడాకుల ఫైలింగ్ ప్రక్రియ మొదలు పెడతారు.అలాగే ఈ పోటీలో పాల్గొన్న వారి నుంచి ఎలాంటి ఫీజును కూడా వసూలు చేయడం లేదు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
ప్రయాణీకులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్న భారతీయ రైలు..?

ఒకవేళ విడాకులు తీసుకోవాలన్న అనుకున్నవారికి మైనర్ చిన్నారులు ఉన్నట్లయితే వారి ఎడ్యుకేషన్ క్లాసులకు అయ్యే ఖర్చులు మొత్తం తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది అన్న ఒక నిబంధన పెట్టారు.

Advertisement

తాజా వార్తలు