ఒక వైపు దేశ అభివృద్ధి ప్రధానంగా దూసుకుపోతుంటే మరోవైపు పోషకాహార లోపంతో బాధపడే ప్రజలు పసిపిల్లలు చాలామందే ఉన్నారు.వారికి సమతుల్య ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ అది ఫలించడం లేదు.
పోషక ఆహారం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.ఇలా బాధపడే వారిని లక్ష్యంగా చేసుకొని ఢిల్లీ ఐఐటీలో ని సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ కావ్య మొక్క ఆధారిత మక్ గుడ్డును అభివృద్ధి చేశారు.
యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఎక్సలేటర్ ల్యాబ్ ఇండియా ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ ఫోర్ ఎస్డి పోటీలలో భాగంగా ఈ మక్ గుడ్డు బహుమతి సొంతం చేసుకుంది.ఈ అవార్డులో భాగంగానే ప్రొఫెసర్ కావ్యకు 5000 డాలర్ల నగదు బహుమతిని ఎంబసీ ఆఫ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, న్యూఢిల్లీ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ క్రిస్టియన్ హీరోనిమస్, భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్ ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు.

ఇక ఈ మక్ గుడ్డులో సాధారణమైన గుడ్డు లాగానే అన్ని రకముల ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.నాన్ వెజ్ తినని వారికి ఇది ఒక చక్కని ఫుడ్ అనే చెప్పాలి.ఇక ఈ గుడ్డును సరళమైన వ్యవసాయ ఆధారిత నుంచి అభివృద్ధి చేశారు ప్రొఫెసర్ కావ్య.
ఈ మక్ గుడ్డు సాధారణమైన గుడ్డు లాగే కనిపించడంతో పాటు రుచి లోనూ పోషకం లోనూ అచ్చం గుడ్డు దగ్గరగానే ఉంటుంది.నిజం చెప్పాలి అంటే ఇది అచ్చం పౌల్ట్రీ గుడ్డు లాగానే ఉంటుందని ప్రొఫెసర్ కావ్య తెలియచేస్తున్నారు.
ఈ మక్ గుడ్డు తో పాటు ఢిల్లీ ఐఐటీ శాస్త్రవేత్తలు కూరగాయలు, పండ్లను ఉపయోగించి చికెన్, చేపల వంటివి కూడా అభివృద్ధి చేశారు.శాఖాహారులకు ఈ గుడ్డు తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు లభిస్తాయని ప్రొఫెసర్ కావ్య పేర్కొంటున్నారు.