వైరల్: అయ్య బాబోయ్ కొండచిలువ.. ఇదేంటి ఇలా దూరుతుంది..!

నేటి సమాజంలో బువ్వలేకున్న బతకతాడేమో గాని చేతిలో ఫోన్ లేకుండా మాత్రం కష్టమే.ఆ ఫోన్ చేతిలో పడిందా వాట్సప్, ఫేస్బుక్, ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ మనోళ్లు పిచ్చి రేపుతుంటారు.

 Viral Hey Baby Python ..this Is How It Goes Away , Phython, Wall, Walking, Viral-TeluguStop.com

ట్విట్టర్ అంటే ఒకటి గుర్తొచ్చింది.ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో మనోళ్లు తెగ వీడియోలు చూసేస్తున్నారు.

అంతేకాదు వాటిని మరింత వైరల్ చేసేస్తున్నారు.ట్విట్టర్ లో ఉత్కంఠ రేపుతున్న ఓ వీడియోకి లైకులే లైకులు.

షేరులే షేరులు.అదేంటో అనుకుంటున్నారా.!.

అదే అనకొండ.1, 2 చూసుంటారుగా కొండచిలువ అంటే మనకు టక్కున గుర్తొచ్చే సినిమాలు ఇవేగా.అబ్బో భయానక దృశ్యాలు, భారీ పాములు.

ఇటువంటి కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ఇక జంతువుల వీడియోలు అంటే మనోళ్లకి ఎక్కడి లేని ఆసక్తి, నిత్యం మన దృష్టికి ఫన్నీ, షాకింగ్, ఆశ్చర్యపరిచే వీడియోలో లక్షల్లో వస్తుంటాయి.

ఇంతకి ఆ భారీ కొండచిలువ ఏం చేసింది అనుకుంటున్నరా!?.

మెట్ల పక్కనున్న గొడను పట్టుకుని అలాపైకి వెళుతూ ఉంది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.భారత అటవీశాఖ అధికారి సుశాంత్ నంద అలా క్లిక్ చేసి ఇలా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

దీనికి సుశాంత్ ‘ప్రతి సారి మెట్లు అవసరం లేదని’ క్యాప్షన్ తో షేర్ చేశారు.మెట్లను ఆనుకుని రెయిలింగ్ పై భారీ కొండచిలువ పాకుతూ ఇంటిపై అంతస్థులోకి వెళ్తుండడం ఇందులో కనిపిస్తోంది.

దీన్ని చూసిన కొందరి గుండెలు గుబేల్ మంటే… మరి కొందరి దీన్ని చూసి భయంకరంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే వీడియో తీసిన వారి ధైర్యానికి మెచ్చుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు.

ఏదైమానా సరే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.ఈ కొండచిలువలు చాలా డేంజర్ జంతువులనే కాదు మనుషులని మింగేస్తాయి.

ఒకసారి మీరు కూడా ఓ లుక్కేయండి ఈ వీడియో పై.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube