ఫ్లిప్‌కార్ట్‌లో రేపే మరో బిగ్ దివాళి సేల్ ప్రారంభం.. అద్భుతమైన ఆఫర్లు ఇవే!

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సమీపిస్తున్న వేళ అక్టోబర్ 12 నుంచి అక్టోబరు 16 వరకు ఒక స్పెషల్ సేల్ నిర్వహించింది.ఆ సేల్ రెండు రోజుల క్రితం ముగియగా ఇప్పుడు మళ్లీ దీపావళి సందర్భంగా ఇంకొక సేల్ తీసుకొచ్చేందుకు ఫ్లిప్‌కార్ట్‌ రెడీ అయింది.‘బిగ్‌ దీపావళి సేల్‌’ పేరుతో అక్టోబర్‌ 19 నుంచి 23వ తేదీ వరకు ఫైవ్ డే స్పెషల్ సేల్ ప్రకటించింది.గత శైలు ఏం కొనుగోలు చేయలేకపోయిన వారు ఈ సేల్ ద్వారా తమకు నచ్చిన వస్తువులను తక్కువ ధరలకే సొంతం చేసుకోవచ్చు.

 Another Big Diwali Sale Is Starting Tomorrow On Flipkart These Are The Amazing O-TeluguStop.com

కాగా ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్ గల కస్టమర్లు 18వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ సేల్‌లో పాటిస్పేట్ చేయవచ్చు.

ఈ స్పెషల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్లపై కంపెనీ అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది.

ఈ డిస్కౌంట్లతోపాటు బ్యాంకు ఆఫర్లు కూడా అందుకని అత్యంత తక్కువ ధరలతో వస్తువులను కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రకారం ఎస్‌బీఐ కార్డుతో స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేవారు ఈ బిగ్‌ దీపావళి సేల్‌లో 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

పేటీఎం వ్యాలెట్‌, యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా కొనేవారు 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు.

Telugu Big Diwali Sale, Flipkart, Diwali Sale, Offers-Latest News - Telugu

రేపట్నుంచి అందరికీ ప్రారంభమయ్యే ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్‌లో రియల్‌మీ, పోకో, శాంసంగ్‌, ఒప్పో, వివో, యాపిల్‌ ఐఫోన్‌, షియోమీ, మోటోరోలా, ఇన్ఫీనిక్స్‌, మైక్రోమాక్స్‌ వంటి చాలా బ్రాండ్స్‌ల మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.రియల్‌మీ సీ33, పోకో సీ31, ఒప్పో కే10 5జీ, రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్లు ఈ సేల్‌లో చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి.ఇక వినియోగదారులు ఇతర ఎలక్ట్రానిక్స్‌ డివైజ్‌లు , యాక్సెసరీస్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్స్‌ పొందొచ్చు.

టీవీలు, హోమ్ అప్లయన్సెస్, వాషింగ్‌ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లపై 75 శాతం వరకు డిస్కౌంట్స్‌ అందుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube