వైరల్: ఒకేసారి క్రికెట్, ఫుట్‌బాల్‌ ఆడేస్తున్న గజరాజు... అదుర్స్ అంతే!

గజరాజు( Gajaraju ) క్రికెట్, ఫుట్‌బాల్‌ ఆడడం ఏమిటి? పైగా ఒకేసారి క్రికెట్, ఫుట్‌బాల్‌( Cricket, Football ) ఆడేస్తుందా? అని అనుమానం కలుగుతుంది కదూ.విషయం తెలియాలంటే మీరు ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.

 Viral Gajaraju Playing Cricket And Football At The Same Time That S All ,crick-TeluguStop.com

కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయం( Sri Durgaparameshwari Temple )లో ఉన్న ఓ ఏనుగు చాలా ప్రత్యేకమైనది.అది అలాంటిలాంటి ఏనుగు కాదండోయ్.

మనిషి ఏది చెబితే అది అచ్చు గుద్దినట్టు అలాగే చేసి పారేస్తోంది.క్రికెట్, ఫుట్ బాల్ ఆడిస్తోంది.సొంతంగా స్నానం కూడా చేసేస్తోంది మరి.36 ఏళ్ల వయసులో కూడా ఆ గజరాజు చాలా చలాకీగా ఆటలు ఆడుతుంది మరి.

1994లో కటీలు ఆలయానికి ఈ ఏనుగును సిబ్బంది తీసుకు రావడం జరిగింది.దీనికి ముద్దుగా మహాలక్ష్మీ అని నామకరణం కూడా చేసారు.గత ఎనిమిది నెలల నుంచి మహాలక్ష్మీ.వారితో ఈ ఆటలు ఆడుతుందని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు.ఫైరోజ్, అల్తాప్, ముజాహిద్ అనే ముగ్గురు యువకులు.ఈ ఏనుగును సంరక్షిస్తూ, ఆటలు కూడా నేర్పిస్తున్నారు.

రోజూ ఈ ఏనుగు 2 గంటలకు పైగా ఫుట్ బాల్, క్రికెట్ ఆడుతుందని సిబ్బంది చెప్పడం స్థానికంగా పెద్ద చర్చనీయాంశం అయింది.

అంతేకాకుండా ఈ గజరాజు తానే సొంతంగా పైపుతో స్నానం చేస్తుందని కటీలు చెబుతున్నారు.రోజూ దేవుడి విగ్రహం ముందుకు వచ్చి గంటలు కొట్టి మరీ ప్రార్థన చేస్తుంది.సరిగ్గా ఉదయం 7 గంటలకు ఏనుగు స్నానం చేస్తోంది.10.30 గంటలకు గడ్డి, బెల్లం, అన్నం, అరటి పండ్లు, దోసకాయలు వంటి ఆహారాన్ని తింటుంది.మధ్యాహ్నం 1.30 గంటలకు జొన్న బాల్స్, 2.45కు ఆకుకూరలు ఆరగిస్తుంది.మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 6.30 గంటల వరకు విశ్రాంతి తీసుకొని మరలా రాత్రి గడ్డి, అరటి పండ్లు వంటివి భుజిస్తుంది.ఇలా రోజుకు దాదాపు 250 కిలోల ఆహారాన్ని ఈ ఏనుగు లాగించేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube