వైరల్: పదేళ్లకు ఒకసారి వికసిస్తున్న పువ్వు.. కాకపోతే..?!

చాలా మందికి పువ్వులు అంటే చాలా ఇష్టం.పువ్వులు ప్రతి ఆడవారి తలలో ఖచ్చితంగా ఉండాల్సిందే.

అలాగే పువ్వులు అనేవి దేవునికి అలంకరించడం ఆనవాయితీ.చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి.

ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా ఉపయోగిస్తారు.ఏ సీజన్ లో అయినా ఈ పువ్వులు అధిక మోతాదులో పూస్తాయి.

ఇలా ప్రపంచంలో అనేక పువ్వులు పూస్తాయి.అన్నింటి గురించి చాలా మందికి తెలీదు.

Advertisement

అయితే కొన్ని పువ్వులు కొన్ని సంవత్సరాల వరకూ పూయవు.తాజాగా అలాంటి పువ్వు గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓ పువ్వు 10 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే పూస్తుంది.వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అది మీరు నమ్మాల్సిందే.

పదేళ్లకు వికసించే ఈ పువ్వు వల్ల అతి దరిద్రమైన వాసన వస్తుంది.అయినా కానీ ప్రజలు ఈ పువ్వు చూడటానికి ఎగబడుతుండటం విశేషమనే చెప్పాలి.

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో కార్ఫ్స్ ఫ్లవర్ అనే అరుదైన పువ్వును గుర్తించారు.ఈ పువ్వు దాదాపు 10 సంవత్సరాల తరువాత వికసించదు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రజలు దూర ప్రాంతాల నుంచి దీనిని చూడటానికి తరలి వస్తుంటారు.బే ఏరియా నర్సరీలో ఈ అరుదైన పువ్వు వికసించింది.

Advertisement

నర్సరీలో పనిచేసే వర్కర్లు పువ్వు ఫోటోను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.పువ్వు చిత్రాన్ని చూసిన తరువాత చాలా మంది దీనిని చూడాలనుకుంటున్నారు.

ఈ పువ్వును చూడటానికి చాలామంది ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని నర్సరీ యజమాని చెబుతున్నారు.ఈ పువ్వు 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుందని యుఎస్ బొటానిక్ గార్డెన్ తెలిపింది.

వికసించడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది.ఆశ్చర్యకరంగా ఈ పువ్వు వాసన చాలా చెడ్డగా ఉంటుంది.

అది సాధారణమైనది కాదు పచ్చి మాంసం లేదా శవం వాసన వస్తుంది.ఈ పువ్వు వద్దకు చేరుకోగానే ప్రజలు ముక్కులు మూసుకుంటారు.

పువ్వు వల్ల ఎటువంటి హాని ఉండదు కానీ వాసన మాత్రమే ఇబ్బంది పెడుతుంది.

తాజా వార్తలు