వైరల్ : ఇదేందయ్యా ఇది.. స్వర్గంలో ప్లాట్ల అమ్మకం.. మీకేమైనా కావాలా..?

రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు భూమి మీద నుంచి చంద్రుడు మీదికి చేరింది.

అయితే ఈ చంద్రుడు మీద చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం( Real Estate ) విదేశాలలో బాగానే నడుస్తోంది.

అయితే ఈ వ్యాపారాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు ఓ చర్చి పాస్టర్.( Church Pastor ) ఆయన ఏకంగా స్వర్గంలోనే భూములను విక్రయిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇచ్చాడు.

అది కూడా చదరపు మీటరుకు కేవలం 100 డాలర్లు అంటూ ఓ పోస్టర్ ను కూడా ఆన్లైన్లో విడుదల చేశారు.ఈ నేపథ్యంలో చాలామంది ఆయన దగ్గర ప్లాట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.

స్వర్గంలో ( Heaven ) ప్లాట్ తీసుకుంటే సాక్షాత్తు దేవుడి పక్కనే నివసించవచ్చని వారు పేర్కొంటున్నారు.ఇక స్వర్గంలో ప్లాటు కొనేందుకు తమ వద్ద అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులను తీసుకుంటామని అలాగే ఆపిల్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ పేమెంట్ కూడా తాము స్వీకరిస్తామంటూ పోస్టులో తెలిపారు.దీంతో ఈ విషయం కాస్త ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది.

Advertisement

ఇక ఈ ప్లాట్లు అమ్ముకునేందుకు దేవుడు అనుమాతి కూడా తనకు ఉందని పాస్టర్ ప్రచారం చేయడం కోసమెరుగు.

అయితే పాస్టర్ చెప్పిన దానిని విని చాలామంది ఆ ప్లాట్స్ బుకింగ్స్( Plots Bookings ) చేసుకుంటున్నారు అంటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే.దేవుడి అనుమతి ఉందంటూ ప్రచారం చేయడంతో వందలాదిమంది పాస్టర్ దగ్గర స్వర్గంలో భూములను కొనుక్కున్నట్లు సమాచారం.ఆ పాస్టర్ స్వర్గంలో భూముల అమ్మకం ద్వారా లక్షలాది డాలర్లను సంపాదించాడని అక్కడి స్థానిక మీడియా చెప్పుకొచ్చింది.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా తాజాగా వైరల్ అవుతుంది.ఆ వీడియోలో ఓ ఇన్ఫ్లెన్సర్ దీనిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ గా అభివర్ణించాడు.

ఆ ఇన్ఫ్లుయెన్సర్ ప్రకారం ఆ పాస్టర్ 2017లో ఓ సమావేశంలో దేవునితో మాట్లాడినట్టు అతడు పేర్కొన్నాడు.స్వర్గంలో భూమి చదరపు మీటరుకు వంద డాలర్లు చొప్పున అమ్మబడుతుందని దానిలో కొంత భాగం కూడా విశ్వం యొక్క సృష్టికర్త పక్కన నివసించడానికి సౌకర్యంగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..
Advertisement

తాజా వార్తలు