వైరల్: చైనాలో ఐస్‌క్రీమ్ అలాగే వుంటుందట.. కాల్చినా కరగదట, చూడండి!

తాజాగా యూట్యూబ్‌లో ఓ ఐస్‌క్రీమ్ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.ఐస్‌క్రీమ్‌ను కరిగించే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

 Viral Chinese Ice Cream Not Melting While Sets On Fire Details, China, Icecream,-TeluguStop.com

లైటర్‌తో ఐస్‌క్రీమ్‌ను కాల్చుతున్నా అది కరగకపోవడం ఏమిటని శోధిస్తున్నారు.అయితే అలా జరగడానికి అందులో వాడే రసాయనాలే కారణమంటూ నెటిన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి.‘హీర్మేస్‌ ఆఫ్‌ ఐస్‌క్రీమ్’ అనే పిలిచే చిసెక్రియా ఐస్ క్రీం ఐస్‌క్రీమ్‌ చూపించి లైటర్‌తో కాలుస్తున్నట్టు ఇక్కడ ఓ వీడియో వుంది చూడండి.అది ఎంతసేపు కాల్చినా కరగడంలేదు.

అయితే ఈ ఐస్‌క్రీమ్‌ను 31 డిగ్రీల సెల్సీయస్‌ వద్ద మండించారు.

అలా సుమారు ఓ గంటపాటు ఈ ప్రయోగం చేశారు.అయనా విచిత్రంగా ఐస్‌క్రీం మాత్రం కరగడంలేదు.

దీంతో కంపెనీపై కొంతమంది నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే, మరికొంతమంది మాత్రం కంపెనీని తీవ్రంగా విమర్శిస్తున్నారు.అందులో ఎలాంటి కాంపెనెంట్స్ కలుపుతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఐస్‌క్రీం తయారు చేసిన కంపెనీ కూడా దీనిపై రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

Telugu China, Chinese Cream, Cream Sets, Icecream, Latest-Latest News - Telugu

సదరు కంపెనీ మేనేజ్ మెంట్ మాట్లాడుతూ… సోషల్‌ ఫుడ్‌ సేఫ్టీ రూల్స్ ప్రకారమే ఐస్‌క్రీం తయారు చేశామని, అందులో ఎటువంటి ప్రమాదకరమైన కాంపోనెంట్స్ కలపలేదని వివరణ ఇచ్చింది.అలాగే ఐస్‌క్రీం నాణ్యత చెప్పడానికి ఉడకబెట్టడం, ఎండబెట్టడం, వేడి చేయడం లాంటి పద్ధతులు సరికావని చెబుతోంది.నాణ్యత పరీక్షకు ఇదే ప్రామాణికం కాదని అభిప్రాయపడింది.

అందులో ఓ సీనియర్ ఫుడ్‌ ఇన్స్పెక్టర్‌ కూడా స్పందిస్తూ, ఐస్‌క్రీమ్ థిక్‌గా తయారు చేయడానికి ఉపయోగించే కాంపొనెంట్స్‌ సురక్షితమైనవేనంటూ వివరణ ఇవ్వడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube