సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు ఆశ్చర్యపరుస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోలో ఒక గొర్రె పోలీస్ వాహనం ఎక్కి ఊరంతా తిరిగింది.అది కూడా అమెరికా పోలీసుల వ్యానులో.
ఇది చూసిన నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు.కొంపదీసి ఆ గొర్రె ఏదైనా నేరం చేసిందా.
అందుకే దాన్ని పట్టుకుపోతున్నారు? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని ఇదా సంగతి అని ఇంకా ఆశ్చర్యపోతున్నారు.
వివరాల్లోకి వెళితే.అమెరికాలోని మైనేలోని ఓల్డ్ టౌన్‌లో ఒక గొర్రె తిరుగుతూ ఒక ఇంటిలోకి ప్రవేశించింది.అయితే ఆ ఇంటి యజమాని దీన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తన ఇంట్లోకి ఒక గొర్రె పిల్ల వచ్చిందని.
దానిని తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశాడు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.
గొర్రె పిల్లను తమ వాహనంలో ఎక్కించుకున్నారు.ఆ తర్వాత ఆ ప్రదేశమంతా తిరుగుతూ దాని ఓనర్ ఎవరో కనిపెట్టాలని అనుకున్నారు.

అలా తిరుగుతున్న వారికి గొర్రె ఇల్లు ఎక్కడో తెలిసింది.ఆ తర్వాత దాని యజమాని తారసపడ్డాడు.అనంతరం అతడితో కలిసి ఆ గొర్రెను ఇంటి దగ్గర జాగ్రత్తగా దిగబెట్టారు.ఆపై ఈ పోలీసు అధికారులు ఆ ఘటనను వీడియో తీసి ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు.
కాగా ఇప్పటికే ఈ వీడియోకి లక్షల వరకు వ్యూస్, వేల లైకులు వచ్చాయి.దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.అయ్యో పాపం పోలీసులకు ఎంత పరిస్థితి వచ్చింది అని నవ్వుతున్నారు కొందరు నెటిజన్లు.ఈ ఫన్నీ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.








