క్రికెట్ టీమ్ ఏమిటని అందరు అనుకుంటున్నారు కదూ! నిజమేనండి.యెంత ధనవంతుడైతే మాత్రం ఈరోజుల్లో.పైగా ఫారిన్లో అంతమంది పిల్లల్ని ఎవరైనా కంటారా? కానీ అతడు నిజం చేసి చూపించాడు.అవును… ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్ ఇప్పటివరకు 9 బిడ్డలను కన్నాడు.మరలా కనేందుకు సిద్ధపడుతున్నాడు.మస్క్ ఎంత క్రేజీ పర్సనో.అందరికీ తెలిసినదే.ఇటీవల ట్విట్టర్ కొనుగోలు చేసి రికార్డులకెక్కాడు.
అతను తన ఆఫీసులో అదే పనిగా పని చేస్తూ.అక్కడే నిద్ర పోతాడని అతని సన్నిహితులు చెబుతూ వుంటారు.
అయితే ఇక్కడ మీకో డౌట్ రావచ్చు.ఇంతకీ 9 మంది పిల్లల్ని ఒకే భార్యకు కన్నడా అని? అస్సలు కాదండీ.మస్క్‌కు ఇప్పటికే అతని మాజీ భార్య, కెనడా రచయిత అయినటువంటి జస్టిన్ విల్సన్‌తో.గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే 5 మంది సంతానం ఉన్నారు.
ఇక.సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే ఇద్దరు సంతానం కలిగారు.మొత్తం 7 మంది కదా.ఇప్పుడు తాజాగా ఆయన కవలలకు జన్మనిచ్చారు.దాంతో ఎలన్ మస్క్ సంతానం సంఖ్య 9కి చేరింది.అయితే ఇది.ఇక్కడితో ఆగుతుందా.ఇంకా పెరుగుతుందా అన్నది.
ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇకపోతే ఎలన్ ఏ పని చేసినా చాలా డిఫరెంట్‌గా, సస్పెన్స్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది.కానీ.అతనెలాంటి డెసిషన్ తీసుకున్నా.
చాలా వేగంగా అమలు చేస్తారని తో సహచరులు చెబుతూ వుంటారు.అదే ఆయన సక్సెస్ కి కారణం అని చెబుతూ వుంటారు.
అయితే.ఈ క్రమంలో కొన్ని నిర్ణయాలు ఊహించనంత ఎత్తుకు తీసుకెళితే.
మరికొన్ని నేలకేసి కొట్టాయ్.ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోలేదు.
విజయం వరించిందని పొంగిపోలేదు ఎలాన్ మాస్క్.అదే.క్రేజీ యాటిట్యూడ్‌తో.తన స్టైల్లో ముందుకెళ్తున్నారు ఎలన్ మస్క్.







