వైరల్: 11 ఏండ్ల బాలిక అద్భుతం చేసింది... కంటి వ్యాధులను కనిపెట్టే యాప్ సృష్టించింది!

ఇక్కడ జనాలు 30 ఏళ్లకే దుకాణం సర్దేస్తుంటే కొన్ని చోట్ల చిన్న చిన్న వయస్సులోనే అసాధారణ విషయాలలో అభివృద్ధి సాధిస్తున్నారు.ఓ రకంగా ఇలాంటి విషయాలు మనచుట్టూ నిరాశానిస్పృహలతో నిండి వున్న కొంతమందికి ఆదర్శవంతం కాగలవు.

 Viral 11-year-old Girl Has Done A Miracle Created An App That Detects Eye Diseas-TeluguStop.com

ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే, మీరు ఔరా అనేక మారరు.విషయంలోకి వెళితే….

దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక ‘లీనా రఫీక్’( Leena Rafique ) కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది.తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది.

ఈమె ఎవరంటే, 9 ఏండ్ల వయసులోనే యాప్‌ను క్రియేట్ చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్( Apple CEO Tim Cook ) ప్రశంసలు పొందిన హనా రఫీక్ సోదరే లీనా రఫీక్‌.11 ఏండ్లకే దుబాయ్‌కు చెందిన ఈ భారతీయ బాలిక లీనా కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించి ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది.సొంతంగా కోడింగ్ నేర్చుకున్న లీనా ఆగ్లర్ ఐస్కాన్( Lena Agler Aiscon ) పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది.ఈ మొబైల్ యాప్ వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు, కంటి పరిస్ధితిని ఇట్టే పసిగట్టేస్తుంది.

ఈ క్రమంలో ఆర్కస్‌, మెలనొమా, శుక్లాలు వంటి వ్యాధులు, పరిస్ధితులను గుర్తించేందుకు ఆగ్లర్ ట్రైన్‌డ్ మోడల్స్‌( Agler trained models )ను వినియోగిస్తుంది.ఆమె ఈ సందర్భంగా తన పోస్టులో రాసుకొస్తూ… “ఏఐ మొబైల్ యాప్ ఆగ్లర్ ఐస్కాన్‌ను సబ్‌మిట్ చేస్తున్నందుకు నాకు చాలా ఉద్వేగంగా ఉంది.నేను పదేండ్ల వయసులో ఈ యాప్‌ను క్రియేట్ చేశాను.మీ ఐఫోన్‌తో వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా ఆగ్లర్ పలు కంటి వ్యాధులు, పరిస్ధితులను ఈ యాప్ పసిగడుతుంది” అని లీనా రాసుకొచ్చింది.

అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ విజన్‌, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ ఆల్గర్ యాప్ పనిచేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube