వైరల్: 11 ఏండ్ల బాలిక అద్భుతం చేసింది… కంటి వ్యాధులను కనిపెట్టే యాప్ సృష్టించింది!
TeluguStop.com
ఇక్కడ జనాలు 30 ఏళ్లకే దుకాణం సర్దేస్తుంటే కొన్ని చోట్ల చిన్న చిన్న వయస్సులోనే అసాధారణ విషయాలలో అభివృద్ధి సాధిస్తున్నారు.
ఓ రకంగా ఇలాంటి విషయాలు మనచుట్టూ నిరాశానిస్పృహలతో నిండి వున్న కొంతమందికి ఆదర్శవంతం కాగలవు.
ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే, మీరు ఔరా అనేక మారరు.విషయంలోకి వెళితే.
దుబాయ్‌కు చెందిన 11 ఏండ్ల బాలిక 'లీనా రఫీక్'( Leena Rafique ) కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది.
తన లింక్డిన్ పోస్ట్‌లో ఈ వివరాలు అందించగా ఆ పోస్ట్ ప్రస్తుతం ట్రెండింగ్ లో వుంది.
"""/" /
ఈమె ఎవరంటే, 9 ఏండ్ల వయసులోనే యాప్‌ను క్రియేట్ చేసి యాపిల్ సీఈఓ టిమ్ కుక్( Apple CEO Tim Cook ) ప్రశంసలు పొందిన హనా రఫీక్ సోదరే లీనా రఫీక్.
11 ఏండ్లకే దుబాయ్‌కు చెందిన ఈ భారతీయ బాలిక లీనా కంటి వ్యాధులను పసిగట్టే ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించి ప్రముఖులతో ప్రశంసలు అందుకుంటోంది.
సొంతంగా కోడింగ్ నేర్చుకున్న లీనా ఆగ్లర్ ఐస్కాన్( Lena Agler Aiscon ) పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది.
ఈ మొబైల్ యాప్ వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా కంటి వ్యాధులు, కంటి పరిస్ధితిని ఇట్టే పసిగట్టేస్తుంది.
"""/" /
ఈ క్రమంలో ఆర్కస్, మెలనొమా, శుక్లాలు వంటి వ్యాధులు, పరిస్ధితులను గుర్తించేందుకు ఆగ్లర్ ట్రైన్‌డ్ మోడల్స్( Agler Trained Models )ను వినియోగిస్తుంది.
ఆమె ఈ సందర్భంగా తన పోస్టులో రాసుకొస్తూ."ఏఐ మొబైల్ యాప్ ఆగ్లర్ ఐస్కాన్‌ను సబ్‌మిట్ చేస్తున్నందుకు నాకు చాలా ఉద్వేగంగా ఉంది.
నేను పదేండ్ల వయసులో ఈ యాప్‌ను క్రియేట్ చేశాను.మీ ఐఫోన్‌తో వినూత్న స్కానింగ్ ప్రక్రియ ద్వారా ఆగ్లర్ పలు కంటి వ్యాధులు, పరిస్ధితులను ఈ యాప్ పసిగడుతుంది" అని లీనా రాసుకొచ్చింది.
అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ద్వారా ఈ ఆల్గర్ యాప్ పనిచేస్తుంది.
క్యా క్యాచ్ హే మాక్స్… అదుర్స్ అంటున్న క్రికెట్ బ్రదర్స్!