సినిమాల్లో ఏదో ఒక అవకాశం వస్తె చాలు చేసుకొని బతుకుతాం అని ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కొందు మాత్రం ఇండస్ట్రీ లో చాలా బాగా సెట్ అవుతారు.మంచి పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటారు…ఇక అందులో కొందరైతే మొదట్లో విలన్ గా చేసి ఆ తరువాత మంచి కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన వారు ఉన్నారు…వారెవరో ఒకసారి తెలుసుకుందాం…
మొదటగా జీవా గారు ఈయన అప్పట్లో వరుసగా విలన్ వేషాలు వేసి జనాలని బయపట్టించిన వ్యక్తి…అలాంటి ఆయన ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమా తో సడన్ గా కమెడియన్ గా మారిపోయారు.అలా అప్పటి నుంచి చాలా సినిమాల్లో కామెడీ క్యారెక్టర్స్ చేస్తూ ఫుల్ బిజీ గా తన కెరియర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు…

జయప్రకాష్ రెడ్డి
జయప్రకాష్ రెడ్డి అప్పట్లో మొత్తం విలన్ పాత్రలు వేసేవాడు ముఖ్యం గా ఆయన్ని సమరసింహా రెడ్డి సినిమాలో చూస్తే అందరూ బయపడిపోయెలా విలనిజాన్ని పండిస్తూ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…

ఇక ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాల్లో కమెడియన్ గా చేస్తూ బాగా క్లిక్ అయ్యారు.సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్, ఉసరవెల్లి లాంటి సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం ఆయన మన మధ్యన లేరు అనే ఒక భాద సినిమా అభిమానులని కలిచి వేస్తుంది…ఆయన లాంటి మంచి ఆర్టిస్టు ని కోల్పోవడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అనే చెప్పాలి…
.







