ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో విడుదలైన సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల పృథ్వీరాజ్ సామ్రాట్, రక్షాబంధన్,లాల్ సింగ్ చద్దా తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
దీంతో హిందీ హీరోలకు కథల ఎంపికలు తెలియడం లేదంటూ తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు.కాగా తెలుగు సినిమాలు హిందీలోకి అనువదించి రిలీజ్ చేయగా ఆ సినిమాలు హిందీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.
ఇటీవల విడుదల అయిన కార్తికేయ 2 లాంటి చిన్న సినిమా కూడా హిందీ లో విపరీతమైన క్రేజ్ ను అందుకుంది.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ కి లైఫ్ సేవర్ ఒకటి కావాలి.
సెప్టెంబర్ లో ప్రధానంగా బ్రహ్మాస్త్ర,విక్రమ్ వేద అనే రెండు భారీ సినిమాలు ఆధిపత్యం చెలాయించేందుకు వస్తున్నాయి.ఈ రెండిటిలో ఏది బాలీవుడ్ ని కాపాడుతుంది? అన్నది ఇప్పుడు డిబేట్ గా మారింది.ఈ బృందం ఎటువంటి ప్రచార మెటీరియల్ ని కూడా ఇంతవరకూ రివీల్ చేయలేదు.విక్రమ్ వేద టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ ను డిమాండ్ చేస్తూ అభిమానులు కొన్ని వారాల నుండి సోషల్ మీడియాలో ఎంతగానో చూస్తున్నారు.
ఎట్టకేలకు ఎంతగానో ఎదురుచూస్తున్న టీజర్ ఆగస్ట్ 24న విడుదల కానుంది.

ఇందులో హృతిక్ రోషన్,సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా పరిశ్రమకు లైఫ్ సేవర్ అవుతుందని హామీ ఇస్తుందా?అన్నా ప్రశ్న ప్రస్తుతం నెటిజన్స్ ని వేడిస్తూ ఉంటుంది.కాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు అవసరమైన అన్ని రకాల ఎలిమెంట్స్ ని కలిగి ఉందని ఈ టీజర్ స్నీక్ పీక్ స్పష్టం చేసిందని గుసగుస వినిపిస్తోంది.కాగా ఒక నిమిషం 46 సెకన్ల నిడివి గల ప్రోమో ఈ చిత్రం థీమ్ ను రివీల్ చేస్తుంది.







