డైరెక్టర్ అజయ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కోబ్రా.విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మృణాళిని రవి తదితరులు నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ పై ఎన్ వి ప్రసాద్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.
భువన్ శ్రీనివాసన్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఈరోజు ఈ మూవీ థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో.అంతేకాకుండా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ కు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే ఇందులో విక్రమ్ కోబ్రా అనే పాత్రలో లెక్కల మాస్టర్ గా కనిపిస్తాడు.ఇక తనకు ఎదురైన ప్రతి ఒక్క సవాల్ ను లెక్కలతోనే పరిష్కరిస్తాడు.అయితే ఓసారి కోబ్రా జీవితంలోకి కొన్ని సమస్యలు వస్తాయి.అవి ఎవరి వల్ల వచ్చాయి అనేది ట్విస్ట్ గా ఉండబోతుంది.ఇక ఇర్ఫాన్ పటాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా పని చేస్తాడు.
ఇతడి వల్ల కోబ్రాకు ఒక సమస్య ఎదురవుతుంది.ఇక శ్రీనిధి శెట్టి, మీనాక్షి లకు కోబ్రా తో ఎటువంటి సంబంధం ఉంటుంది.
అంతేకాకుండా కోబ్రా వివిధ రూపాలను మార్చుకోవడానికి అసలు కథ ఏంటి అనేది మిగిలిన కథలో చూడవచ్చు.
నటినటుల నటన:
విక్రమ్ మరోసారి తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఫిదా చేశాడు.పైగా సినిమాలో తన కష్టపడ్డ తీరు బాగా కనిపిస్తుంది.ప్రతి ఒక్క గెటప్ తో విక్రం అదరగొట్టాడు.
అంతేకాకుండా తన ఎక్స్ప్రెషన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు.ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి నటనతోనే మంచి మార్కులు సంపాదించుకున్నాడు.
ఇక శ్రీనిధి శెట్టి కూడా తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.తదితర నటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
ఈ సినిమాకు డైరెక్టర్ మంచి కథను అందించాడు.ఇక సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఏ ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మాత్రం మరోసారి ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక సాంకేతికపరంగా సినిమాకు పూర్తి న్యాయం చేశారు.
విశ్లేషణ:
ఈ సినిమాకు డైరెక్టర్ ఎంచుకున్న కథ అద్భుతంగా ఉంది.ముఖ్యంగా లెక్కలతో సినిమాను నడిపించడం అద్భుతంగా ఉంది.
పైగా లెక్కలతోనే సవాళ్లు పరిష్కరించడం అనేది ప్లస్ పాయింట్ గా మారింది.కథనం కూడా అద్భుతంగా ఉంది.
సవాల్ విసిరే సన్నివేశాలు అద్భుతంగా చూపించాడు డైరెక్టర్.
ప్లస్ పాయింట్స్:
విక్రమ్ నటన, సినిమా కథ, సంగీతం బాగా ఆకట్టుకుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త స్లోగా సాగినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
ఇక ఈ సినిమాను విక్రమ్ నటన కోసం, ఈ సినిమా కథ కోసం చూడవచ్చు.నిజానికి ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని అర్థమవుతుంది.