అపరిచితుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసి సూపర్ స్టార్ గా ఎదిగి పోయాడు.అయితే అపరిచితుడు( Aparichitudu ) ఇచ్చిన సక్సెస్ తో అప్పటి నుంచి నేటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ పై విక్రమ్( Vikram ) దండయాత్ర చేస్తూనే ఉన్నాడు.
కానీ ఆ రేంజ్ హిట్ అయితే కొట్టక పోగా డబ్బింగ్ చేసి వదిలిన సినిమాలు ఏవి కూడా తెలుగు ప్రేక్షుకులను ఆకట్టు కోలేదు.అయితే ఇప్పుడు ఒక విషయం మాత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులనే కాదు విక్రమ్ ని కూడా షాక్ కి గురి చేసింది.
అదేంటంటే విక్రమ్ అప్పుడేప్పుడో నటించి విడుదల చేయని సినిమాలు ఇప్పుడు ఆ హీరోకే తెలియకుండా రిలీజ్ కి సిద్ధం అయిపోయాయి.మరి ఆ సినిమాలు ఏంటి ? ఎందుకు ఆగిపోయాయి ? ఎప్పుడు విడుదల అవుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
పదేళ్ల కింద గౌతమ్ మీనన్ హీరో విజయ్ తో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు.కానీ అది ఎందుకో వర్క్ అవుట్ అవ్వక పోవడం తో అదే సినిమాను ఏడేళ్ల కింద విక్రమ్ హీరో గా ధ్రువ నక్షత్రం( Dhruva Nakshatram ) పేరుతో సినిమాగా తీశారు.అయితే ఈ చిత్రం 2016 నుంచి సెట్స్ పైననే ఉండి ఇప్పుడు నవంబర్ 24 న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ గౌతమ్ మీనన్.( Gautam Menon ) ఇదొక్కటే కాదు 2017 లో షూటింగ్ జరుపుకున్న సూర్య పుత్ర కర్ణ సినిమా( Surya Puthra Karna Movie ) పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది.
ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోగా ఏ కారణాల చేతనో ఈ సినిమ విడుదల అవ్వలేదు.
కానీ ఇప్పుడు విక్రమ్ కి ఈ సినిమా విడుదల అవుతున్న సంగతి కూడా తెలియకుండా టీజర్ ని కూడా వదిలారు మేకర్స్.కర్ణ అనే ఒక సినిమా చేస్తున్నట్టు కూడా అభిమానులకు కూడా ఎలాంటి క్లూ లేదు.ఇలా విక్రమ్ ని విచిత్రమైన పరిస్థితులలో నెడుతూ అతడు నటించిన పాత సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి.
ఇక పాత సినిమాల సంగతి పక్కన పెడితే విక్రమ్ తాజాగా నటిస్తున్న సినిమా తంగలాన్.( Thangalaan ) ఈ సినిమా కోసం విక్రమ్ ఎంత కష్టపడుతున్నాడో అతడి గెటప్ చూసి అర్ధం చేసుకోవచ్చు.