ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న విక్రమ్ నటుడు... ఫోటోలు వైరల్!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం విక్రమ్( Vikram ) .

ఈ సినిమాలో విక్రమ్ కొడుకు పాత్రలో నటించినటువంటి నటుడు కాళిదాసు జయరాం( Kalidas Jayaram ) గురించి అందరికీ తెలిసిందే.

ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాళిదాసు జయరామ్ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తన ప్రేమించినటువంటి అమ్మాయిని ఎంతో ఘనంగా నిశ్చితార్థం ( Engagment ) చేసుకున్నారు.

ప్రస్తుతం వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక కాళిదాసు జయరాం ప్రముఖ నటుడు జయరాం( Actor Jayaram ) కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.ఈయన తమిళ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ హీరోగా కొనసాగుతున్నారు.ఇలా హీరోగా కొనసాగుతున్నటువంటి కాళిదాసు జయరాం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈయన తాను ప్రేమించిన అమ్మాయితో శుక్రవారం నిశ్చితార్థం జరుపుకున్నారు.అయితే చాలా ఆలస్యంగా వీరిని నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిశ్చితార్థం జరుపుకున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక కాళిదాసు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు తరుణి( Taruni Kalingarayar ) .ఈమె తమిళనాడులో ఒక ఫేమస్ మోడల్.2019వ సంవత్సరంలో తరణి మిస్ తమిళనాడు పెజెంట్ కిరీటాన్ని కూడా దక్కించుకుంది.చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంగా వివాహం చేసుకోబోతున్నారు.

 ఇక వీరి కోలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా హాజరయ్యారు.కాళిదాసు కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగులో కూడా భాగమతి అలా వైకుంఠపురం ధమాకా ఖుషి వంటి సినిమాలలో నటించారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు