రెండో వారం చతికిలపడ్డ లియో.. విజయ్ కు షాక్ మామూలుగా తగల్లేదుగా!

స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో ( LEO ).

ఏడాదికి రెండు మూడు సినిమాలను చేసే విజయ్ ఈ ఏడాది ఇప్పటికే వారిసు సినిమాతో విజయం సాధించాడు.

ఇక ఇప్పుడు దసరా బరిలో లియో సినిమాతో వచ్చాడు.అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ముందు నుండి భారీ అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.అయితే టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చింది.

దీంతో ఈ సినిమా విజయ్ ఫ్యాన్స్ ను అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయింది.అయితే దసరా సీజన్( Dussehra season ) కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి.

Advertisement

ఇక ఎప్పుడైతే సెలవలు పూర్తి అయ్యి వీక్ డేస్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుండి లియో కలెక్షన్స్ దారుణంగా పడిపోతున్నాయి.

210 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుని బరిలోకి దిగిన లియో సినిమా దాదాపు 34 దేశాల్లో రిలీజ్ చేయగా ఫస్ట్ వీక్ ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు.అయితే రెండవ వారం మాత్రం మొత్తం పడిపోయింది.8వ రోజు 9 కోట్లు, 9వ రోజు కేవలం 7.5 కోట్లు మాత్రమే రాబట్టగా బాక్సాఫీస్ దగ్గర జోరు పూర్తిగా తగ్గింది అనే చెప్పాలి.అయితే దాదాపు రిలీజ్ అయిన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయినట్టే అని చెప్పాలి.

కాగా లియో ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు