విజయవాడ ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భవానీలు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి భవానీలు పోటెత్తారు.ఈ క్రమంలో దుర్గామాత నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగుతుంది.

కాగా ఇవాళ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఈ క్రమంలో అమ్మవారి సన్నిధానం వరకు క్యూ లైన్లలో భక్తులు, భవానీలు బారులు తీరారు.

ఇరుముడి శిరస్సు ధరించి అమ్మవారి దర్శనం తరువాత భవానీలు దీక్షను విరమణ చేస్తున్నారు.మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు.

కూతురు కోసం కొరియా వెళ్లిన ఇండియన్ ఫాదర్.. వీడియో చూస్తే ఫిదా..
Advertisement

తాజా వార్తలు