కూలిన వేదిక .. కిందపడ్డ విజయశాంతి  

Vijayasanthi Falls Down After Congress Campaign Stage Collapsed-

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది. స్టేజీపై నాయకులంతా కూర్చొని ఉండగా ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి నిలబడి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు...

కూలిన వేదిక .. కిందపడ్డ విజయశాంతి -Vijayasanthi Falls Down After Congress Campaign Stage Collapsed

అదే సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలింది. ఈ ఘటనలో విజయశాంతి వేదికపై నుంచి కింద పడ్డారు. ఘటన జరిగిన సమయంలో వేదికపై విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, పలువురు నాయకులు ఉన్నారు.

అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.