సెంటిమెంట్ ఫాలో అవుతున్న దళపతి.. 65వ సినిమా రిలీజ్ కూడా అప్పుడే!

తమిళంలో రజనీ కాంత్ తర్వాత అంత పేరు, ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు దళపతి విజయ్.ప్రస్తుతం విజయ్ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.

2021 సంక్రాంతికి విడుదలైన మాస్టర్ సినిమా తో మరొకసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు విజయ్.ఈ సినిమా తెలుగులో పర్వాలేదనిపించినా తమిళ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అంతేకాదు భారీ వసూళ్లు కూడా రాబట్టింది.దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో రికార్డు సృష్టించింది.

ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ తన 65 వ సినిమాను ప్రారంభించాడు.ఈ మధ్యనే పూజ కార్యక్రమాల తో ప్రారంభమయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

Advertisement

సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.

ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈయన మొదటి సినిమా నయనతారతో కొలమావు కోకిల అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.ప్రస్తుతం నెల్సన్ శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది.ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు.

ఈ సినిమాలో రాజకీయంగా సాగే సన్నివేశాలే హైలెట్ అని దర్శకుడు చెబుతున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాలో దళపతి విజయ్ కు జంటగా మొట్టమొదటి సారిగా బుట్టబొమ్మ పూజ హెగ్డే నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ చివరిలో స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేయాలనీ విజయ్ భావిస్తున్నాడు.ఈ సినిమాను కూడా విజయ్ కు బాగా అచ్చోచిన పొంగల్ కానుకగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ అభిప్రాయం పడుతుంది.

Advertisement

ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు