ఎన్టీఆర్ కోసం బరిలోకి దిగుతున్న విజయ్ సేతుపతి

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు.అటు తమిళ చిత్రాలతో పాటు తెలుగులోనూ తనదైన మార్క్ వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

 Vijay Sethupathi In Ntr Movie, Vijay Sethupathi, Uppena, Ntr, Trivikram, Tollywo-TeluguStop.com

ఇటీవల ఆయన నటించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో చిత్రంలో విజయ్ సేతుపతి నటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తారక్ తన 30వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.అయితే ఈ విలన్ పాత్రలో ఎవరిని నటింపజేయాలా అని చిత్ర యూనిట్ ఆలోచిస్తుండగా, ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి యాక్టింగ్‌కు ఇంప్రెస్ అయిన త్రివిక్రమ్ అండ్ టీమ్, తమ సినిమాలో ఆయన్ను విలన్‌గా తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో తారక్ చాలా సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది.

కాగా విలన్ పాత్ర కూడా అల్ట్రా స్టైలిష్‌గా ఉండనుండటంతో, ఈ సినిమాలో విజయ్ సేతుపతి అయితే పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఈ సినిమాలో ఆయన్ను తీసుకునేందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట.అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విజయ్ సేతుపతి అభిమానులు.

మొత్తానికి ఉప్పెన చిత్రం సక్సెస్‌తో విజయ్ సేతుపతికి టాలీవుడ్‌లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడిందనే విషయం స్పష్టం అవుతోంది.మరి త్రివిక్రమ్ చిత్రంలో ఆయన విలన్ పాత్రలో నటిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube