విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ), సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న ఖుషి సినిమా విషయంలో ఒకరికి మాత్రం డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తుంది.అదేంటి సినిమాకు పనిచేస్తే ఒకసారి మాత్రమే రెమ్యునరేషన్ ఇస్తారు కదా మరి ఎందుకు స్పెసిఫిక్ గా ఒకరికి డబుల్ రెమ్యునరేషన్.
ఇంతకీ ఎవరా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది అంటే ఇంకెవరు డైరెక్టర్ శివ నిర్వాణ( Shiva Nirvana ) అని తెలుస్తుంది.నిన్ను కోరి సినిమాతో మొదలైన అతని డైరెక్షన్ టాలెంట్ రెండో సినిమా మజిలీ తో కూడా హిట్ కొట్టాడు.
థర్డ్ సినిమా టక్ జగదీష్ ఫ్లాప్ అందుకున్నా అతని మీద ఉన్న నమ్మకంతో విజయ్ దేవరకొండ ఛాన్స్ ఇచ్చాడు.ఖుషి సమంత( Samantha ) ఇద్దరికి ఈ సినిమా హిట్ వెరీ ఇంపార్టెంట్.ఖుషి సినిమా విషయంలో డైరెక్టర్ గా మాత్రమే కాదు లిరిక్ రైటర్ గా కూడా శివ పనిచేస్తున్నాడు.ఖుషి సినిమా నుంచి ఇప్పటివరకు 3 సాంగ్స్ రిలీజ్ కాగా ఆ 3 సాంగ్స్ కి శివ నిర్వాణ సాహిత్యం అందించాడు.
సో అందుకే శివ నిర్వాణకి ఖుషి ద్వారా డబుల్ రెమ్యునరేషన్ అందుకునే అవకాశం ఉంది
.