టాలీవుడ్ సెన్సేషనల్ నటుడు విజయ్ దేవరకొండ ఎంత స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతాడో అందరికి తెలుసు.ఈయన ఇచ్చే స్టేట్ మెంట్స్ ఎప్పుడు వివాదాన్ని కానీ వైరల్ కానీ అవుతూనే ఉంటాయి.
ఈయన ప్రతి సినిమా ప్రొమోషన్స్ సమయంలో కొన్ని కామెంట్స్ వైరల్ అవుతూ ఉండడమే కాకుండా ఆ సినిమాలకు పబ్లిసిటీ కూడా తెచ్చిపెడతాయి.
ఇక ఇప్పుడు ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ప్రొమోషన్స్ లో కూడా విజయ్ ఇదే స్ట్రాటజీ వాడుతున్నాడు.
ఈయన చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన స్టేట్ మెంట్స్ వివాదానికి దారి తీస్తున్నాయి.దీంతో సినిమా ప్రొమోషన్స్ కు కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి.ప్రెజెంట్ విజయ్ లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
మరొక రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.
వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.
విజయ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇది ఇలా ఉండగా తాజాగా ఈయన ప్రొమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

లైగర్ సినిమాపై బాలీవుడ్ లో కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయగా విజయ్ దీనిపై తాజాగా మరోసారి స్పందించారు.నాకు మా అమ్మ గారి ఆశీర్వాదం, ప్రేక్షకుల ప్రేమ అభిమానంతో పాటు దేవుడి కృప, ముఖ్యంగా గెలవాలి అనే ఫైర్ నా లోపల ఉంది.అందుకే మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా అంటూ నెగిటివ్ స్ప్రెడ్ చేసే వారికీ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
చూస్తుంటే ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.







