భారతీయుడికి కళ్ళు చెదిరే లాటరీ...ఎంతో తెలిస్తే....

అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం, చెప్పి వచ్చేది కాదు అదృష్టం అంటే.ఊహించని విధంగా, అదృష్ట దేవత వరించాలే గానీ రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

 Huge Lottery For An Indian If You Know How Much , Lottery, Shanawaz ,dubai, M-TeluguStop.com

ముఖ్యంగా భారత్ నుంచీ అరబ్బు దేశాలకు వెళ్ళిన భారతీయ కార్మికులు ఎంతో మంది ఆయా దేశాలలో నిర్వహించే లాటరీ డ్రా లలో పాల్గొని కోటీశ్వరులు అయ్యే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు.కొందరిని అదృష్టం మొదటి ప్రయత్నంలోనే వరిస్తే మరికొందరు మాత్రం ఏళ్ళ తరబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు.

ఈ కోవకి చెందిన వాడే

కేరళ లోని తిరువనంతపురం కి చెందిన షానవాజ్ సుమారు 15 ఏళ్ళుగా దుబాయ్ లోనే ఉంటున్నాడు.ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్న షానవాజ్ కు తనకు వచ్చే నెల జీతం చాలక పోగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

దాంతో గడిచిన ఏడాదిగా తన కష్టాల నుంచీ గట్టేక్కేందుకు దుబాయ్ లో ప్రఖ్యాత లాటరీ నిర్వాహకులైన మాజూజ్ లాటరీలో టిక్కెట్టు ఒకటి కొనుగోలు చేశాడు.తాను కొనుగోలు చేసిన 7 , 9 , 17, 19 ,21 సీరీస్ గల నెంబర్ కు భారీ జాక్ పాట్ తగలడంతో అతడి సంతోషానికి అవధులు లేవు.

Telugu Dirhams, Dubai, Kerala, Lottery, Mazuj Lottery, Shanawaz-Telugu NRI

మొదటి ఫ్రైజ్ లోనే షానవాజ్ 50 లక్షల దిర్హమ్స్ గెలుచుకున్నాడు అంటే భారతీయ కరెన్సీ లో దాని విలువ అక్షరాలా రూ.10 కోట్లు పై మాటే.ఇంత భారీ మొత్తంలో డబ్బు గెలుచుకున్న అతడి ఉబ్బితబ్బిబ్బై పోయాడు.లాటరీ నిర్వాహకులు డ్రా తీస్తున్నంత సేపు తన కొడుకు లైవ్ చూస్తూనే ఉన్నాడని మేము కొన్న టిక్కెట్టు నెంబర్ ను నిర్వాహకులు ప్రకటించగానే పెద్దగా అరుస్తూ తన కొడుకు గంతులు వేశాడని, ఈ రేంజ్ లో తనను అదృష్టం వరిస్తుందని అనుకోలేదని ఈ డబ్బుతో తనకున్న అప్పులు తీర్చేసి దుబాయ్ లో మంచి వ్యాపారం పెట్టుకుంటానని షానవాజ్ తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube