టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
లైగర్ సినిమా తర్వాత ఖుషి సినిమా( Khushi )తో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అనేక రకాల వార్తలు కూడా వినిపించాయి.
అయితే ముందుగా అనుకున్నట్లుగానే విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే టైటిల్ ను ఖరారు చేశారు.టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు దిల్ రాజు.
అయితే ఇప్పటివరకు చేసిన చిత్రాలతో పోలిస్తే విజయ్ డిఫరెంట్ లుక్‌లో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో( Middle Class Father Role ) కనిపించడం విశేషం.కాగా తాజాగా విడుదల చేసిన ఆ టీజర్ లో ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్, బయట రౌడీల బెండు తీసే పవర్‌ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కనిపించారు.
లైన్‌లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా.
భలే మాట్లాడతారన్నా మీరంతా, ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరెన్ వంచాలా ఏంటి? అని డైలాగ్స్‌తో విజయ్ ఆకట్టుకున్నాడు.మొత్తానికి టీజర్( Family Star Teaser ) ని బట్టి చూస్తే ఇదివరకు ఎప్పుడూ చూడని విజయ్ దేవరకొండ ను ఈ టీజర్ లో మనం చూడవచ్చు.ఇక టీజర్ చివరలో విజయ్ భార్యగా మృణాల్ నటిస్తుందనే విషయాన్ని రివీల్ చేశారు.
ఫ్యామిలీ స్టార్ వీడియో చూస్తుంటే మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చూపిస్తూనే అక్కడక్కడ యాక్షన్ చూపిస్తారనిపిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మూవీ మేకర్స్.