సెప్టెంబర్ 1న భారీ అంచనాల మధ్య సమంత( Samantha ) విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే మూవీ యూనిట్ ఎన్నో ఈవెంట్లలో, ప్రమోషన్స్ లో పాల్గొని సినిమా గురించి ప్రమోట్ చేస్తున్నారు.అయితే తాజాగా విజయ్ దేవరకొండ( Vijay deverakonda ) సమంత ఇద్దరు కలిసి ఒక తమిళ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య తమకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ఇందులో భాగంగా సమంత మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మరి సమంత ఏం మాట్లాడింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
సమంత ఇప్పటికే విజయ్ దేవరకొండకి సంబంధించి పెళ్లి చేసుకునే అమ్మాయి క్వాలిటీలు అలాగే ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు కొన్ని ఈవెంట్లలో బయట పెట్టింది.ఇక తాజాగా తమిళ ఇంటర్వ్యూలో సమంత( Samantha ) విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.విజయ్ ని చూస్తే అందరూ ఎన్నో చెడు అలవాటు ఉంటాయి అని భావిస్తూ ఉంటారు.కానీ విజయ్ దేవరకొండలో మాత్రం అలాంటి చెడు అలవాటు ఒక్కటి కూడా లేదు.
ఇక ఈ విషయం తెలిసి నేను కూడా షాక్ అయ్యాను.విజయ్ దేవరకొండ ఇంత మంచి వాడా అని.కానీ చాలామంది ఈయన గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు అంటూ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పై సమంత పాజిటివ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం సమంత మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మాటలు విన్న నెటిజన్స్ నిజంగానే విజయ్ దేవరకొండ ప్రవర్తన చూసి అందరూ అలాగే అనుకుంటారు.
కానీ ఆయన లోపల స్వభావం ఎవరికీ తెలియదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి( Khushi ) సినిమాపై విజయ్ దేవరకొండ సమంత ఇద్దరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు ఎందుకంటే సమంత శాకుంతలం సినిమా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రెండు ప్లాఫ్ అవ్వడంతో ఖుషి సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుంది అనేది ముందు ముందు చూడాలి
.