డిజిటల్ లో పెట్టుబడులు పెట్టబోతున్న దేవరకొండ

లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మొత్తం మూతపడిపోయింది.గత మూడు నెలలుగా చిత్ర పరిశ్రమ ఇంటికే పరిమితం కావడం వలన తీవ్ర నష్టాలలో ఉందని చెప్పాలి.

 Vijay Devarakonda Enter Ott Platform, Tollywood, Telugu Cinema, Aha App, South C-TeluguStop.com

ఇక మళ్ళీ థియేటర్లు ఎప్పటికి తెరుచుకుంటాయి అనే విషయంలో స్పష్టత లేదు.ఈ నేపధ్యంలో డిజిటల్ ప్లాట్ ఫాం హవా మొదలవుతుంది.

ఇప్పటికే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా లాంటి చానల్స్ వాటి ప్రభావం చూపించడం మొదలైంది.ఇప్పటికే తెలుగులో వెబ్ సిరీస్ లు నిర్మితం అవుతున్నాయి.

ఇక ప్లాట్ ఫాంలలో సినిమాలు కూడా కొన్ని నేరుగా రిలీజ్ అయిపోతున్నాయి.ఇప్పటికే వాయిదా పడి రిలీజ్ కోసం వేచి చూస్తున్న చాలా సినిమాలు డిజిటల్ లోకి వచ్చేస్తున్నాయి.

ఇక మన నిర్మాతలు, హీరోలు, హీరోయిన్స్ అందరూ కూడా వెబ్ సిరీస్ లవైపు దృష్టి పెడుతున్నారు.

తాజాగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా వెబ్ సిరీస్ కు ప్లాన్ చేశాడు.

తాను స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ ద్వారా ఇప్పటికే ఒక సినిమా నిర్మించిన దేవరకొండ ఇప్పుడు వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమయ్యాడు.దొరసాని సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం.

ఈ వెబ్ సిరీస్ ఆహా ప్లాట్ ఫాంలోనే రిలీజ్ కాబోతుందని టాక్ వినిపిస్తుంది.ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కు విజయ్ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ఓటీటీ ప్లాట్ ఫాంని మార్కెట్ లోకి తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో ఈ విజయ్ దేవరకొండ కూడా ఈ మార్గంలోకి వస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube