అలాంటి పాత్రలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్న విజయ్!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ జోరు చూపిస్తున్నాడు.ఈయనకు రోజు రోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.

విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.

ఈయన త్వరలోనే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.విజయ్ ప్రెసెంట్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాలో ఈయన బాక్సర్ గా కనిపించ నున్నాడు.స్లమ్ నుండి వచ్చిన యువకుడు ప్రపంచ స్థాయిలో బాక్సర్ గా ఎలా ఎదిగాడు.

దేశానికీ ఎలాంటి గుర్తింపు తెచ్చాడు? అనే కథాంశంతో తెరకెక్కుతుంది.ఈ సినిమా తర్వాత కూడా విజయ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కే జనగణమన సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా కూడా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇందులో విజయ్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించ నున్నారు.ఇటీవలే ఈ సినిమాను అధికారికంగా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు.

ఈ సినిమా తర్వాత శివ నిర్వాణం దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది.ఈ సినిమాలో సమంత తో కలిసి విజయ్ నటించబోతున్నాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సినిమాకు ఖుషి అనే టైటిల్ అనుకుంటున్నారు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇందులో విజయ్ ఆర్మీ మ్యాన్ గా కనిపించ నున్నాడట.

Advertisement

ఇలా విజయ్ చేస్తున్న సినిమాలన్నీ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తిని చాటిచెప్పే విధంగానే ఉన్నాయి.లైగర్ పక్కన పెడితే తెలుగులో ఆర్మీ పాత్రలు చేసిన సినిమాలు విజయం సాధించలేదు.

మరి లుక్ విధంగా కూడా ఏమీ మార్చడానికి లేదు.మరి ఈ సినిమాల్లో విజయ్ కొత్తగా కనిపిస్తాడా లేదంటే రొటీన్ గా కనిపిస్తాడా అనేది చూడాలి.

తాజా వార్తలు