రౌడీ హీరో విజయ్ దేవరకొండతో( Vijay Devarakonda ) ఒక సినిమా చేస్తే చాలు అతనితో బాగా క్లోజ్ అవుతుంటారు హీరోయిన్స్.ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ టైం లో సమంత కూడా విజయ్ కి బాగా దగ్గరైనట్టు తెలుస్తుంది.వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని తెలుస్తుంది.
విజయ్ దేవరకొండ ఖుషి( Khushi ) తర్వాత పరశురాం తో మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాలో ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ ( Mrinal Thakur )హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కూడా అవసరం ఉంటుందని తెలుస్తుంది.
అయితే విజయ్ ఈ సినిమాలో కూడా సమంతని తీసుకోవాలని రికమెండ్ చేస్తున్నాడట.ఖుషి ఎలాగు హిట్ పడుతుందని నమ్మకంతో ఉన్న విజయ్ సమంత తో మరోసారి జత కట్టాలని చూస్తున్నాడు.దిల్ రాజు( Dil raju ) కూడా సమంత అయితే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని ఆమెను తీసుకునే ఆలోచనలో ఉన్నాడట.పరశురాం ఓకే అంటే సమంత విజయ్ మరో సినిమాలో ఫిక్స్ అయినట్టే లెక్క.
ఇక విజయ్ ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది.లైగర్ తర్వాత విజయ్ నుంచి వస్తున్న సినిమాగా ఖుషి మీద రౌడీ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు.