విజయవాడ: విజయవాడలో సందడి చేసిన లైగర్ చిత్ర యూనిట్.ప్రమోషన్ లో పాల్గొన్న హీరో విజయదేవర కొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ప్రొడ్యూసర్ చార్మి.
హీరో విజయ దేవరకొండ మాట్లాడుతూ.మూడేళ్ల నుంచి లైగర్ సినిమా తీస్తున్నాం.
ఇంకా ఐదు రోజుల ఉంది సినిమా విడుదలకు.ఇవాల్టి నుంచి ఎపి, తెలంగాణా లో టిక్కెట్స్ ఓపెన్ అయ్యాయి.
ప్రాణం పెట్టి లైగర్ సినిమా తీశాం.అందరికీ సినిమా నచ్చుతుంది.
పూరి కధ చెప్పగానే మెంటలొచ్చింది.వెంటనే ఓకే చెప్పేశా.
నటిస్తున్నప్పుడు ద్రిల్ ఉంది.
సినిమాను ఇండియాకు పరిచయం చేసింది కరన్ జోహార్.
మూడేళ్లు కష్టపడి పనిచేశాం.సినిమా తీసి ఇంట్లో కూర్చోవాలా.
మనం ధర్మంతో ఉన్నాం.ఏదొచ్చినా కొట్లాడుడే.
కరోనా సమయంలో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ కు సహకరించారు.వాళ్లిచ్చిన డబ్బు లతో నే సేవ చేశా.తల్లి సెంటిమెంట్ తో ఇండియా ఫ్లాగ్ ఎగురవేస్తే బాయ్ కాట్ చేస్తారా .చూద్దాం… ఆల్రడీ బుకింగ్స్ ఓపెనయ్యాయి.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.లైగర్ సినిమా యాక్షన్ డ్రామా.కుర్రోడ్ని తీసుకొని తల్లి ముంబాయి వెల్తుంది.బాక్సర్ ను తల్లి చేస్తుంది.
మధ్యలో ప్రేమలో పడతాడు అది లైగర్ స్టోరీ. చిన్న పెద్ద అందరూ కలిసి సినిమా చూడొచ్చు.
అమ్మా, నాన్న తమిళమ్మాయి కి లైగర్ వేరే స్టోరీలు.లైగర్ లాంటి సినిమాను థియేటర్లలోనే చూడాలి.
ఓటీటీ లో చూడాల్సిన సినిమా కాదు.