జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాన్వాయ్ లోని వాహనాలకు ప్రమాదం జరిగింది.వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో పది మందికి గాయాలయ్యాయి.
బాధితులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే పవన్ కడప పర్యటన నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా సిద్ధవటం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో.జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పేరిట భారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దీనిలో భాగంగానే పలు జిల్లాల్లో పర్యటించిన జనసేనాని.నేడు ఉమ్మడి కడప జిల్లా పర్యటనకు వెళ్లారు.







