విజయ్ ఆంటోని బిచ్చగాడు సెంటిమెంట్ తమిళంలో కన్నా తెలుగులో బాగా వర్క్ అవుట్ అవుతుంది.బిచ్చగాడు 2 ఊహించని విధంగా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది.
బిచ్చగాడు 1 రేంజ్ కాకపోయినా బిచ్చగాడు 2 సినిమా కూడా తెలుగులో సక్సెస్ అందుకుంది.ఇక ఇప్పుడు ఇదే ప్రోత్సాహంతో బిచ్చగాడు 3( Bicchagadu 3 ) సినిమా చేయాలని అనుకుంటున్నాడు విజయ్ ఆంటోని( Vijay Antony ).ఆ సినిమాను కూడా తానే డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.బిచ్చగాడు 3 సినిమా కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే చేయాలని అనుకుంటున్నాడట.

ఇక మరోపక్క బిచ్చగాడు 3 తెలుగులో మరింత క్రేజ్ తెచ్చుకునేందుకు ఇక్కడ హీరోని ఒకరిని సినిమాలో భాగం చేస్తున్నాడట విజయ్ ఆంటోని.అంటే బిచ్చగాడు 3 సినిమా అనుకున్న దాని కన్నా పెద్దగానే ఉండే అవకాశం ఉంటుంది.ఇంతకీ బిచ్చగాడు 3 లో నటించే ఆ హీరో ఎవరు అంటూ ఇప్పటికే డిస్కషన్స్ మొదలయ్యాయి.బిచ్చగాడు 3 బడ్జెట్ విషయంలో కూడా విజయ్ ఆంటోని భారీగా పెట్టేయాలని ఫిక్స్ అయ్యారు.
మొదటి సినిమా మదర్ సెంటిమెంట్, రెండో సినిమా సిస్టర్ సెంటిమెంట్ కాగా బిచ్చగాడు 3 ఫాదర్ సెంటిమెంట్ ( Father sentiment )తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.ప్రస్తుతం విజయ్ ఈ సినిమా కథ రాసే బిజీలో ఉన్నారు.







