విజయ్ ఆంటోనీ, ఫరియా అబ్దుల్లా జంటగా 'వల్లి మయిల్' తొలి షెడ్యూల్ పూర్తి

బిచ్చగాడు, డాక్టర్ సలీమ్, విజయ రాఘవన్ వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నటిస్తున్న కొత్త సినిమా వల్లి మయిల్ తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

 Vijay Anthony Faria Abdullah Valli Mayil Movie First Schedule Completed Details,-TeluguStop.com

ఈ చిత్రానికి సుసీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.నల్లుసామీ పిక్చర్స్ పతాకంపై థాయి శరవణనన్ నిర్మిస్తున్నారు.

పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో నాయికగా నటిస్తోంది.

ఫస్ట్ షెడ్యూల్ లో దిండిగల్ ఏరియాను ప్రతిబింబిస్తూ 80 దశకపు వాతావరణం కనిపించేలా కోటి రూపాయలతో సెట్ ను నిర్మించారు.ఇక్కడ ప్రధాన సన్నివేశాలు రూపకల్పన జరిపారు.

ఫస్ట్ షెడ్యూల్ ఔట్ పుట్ తో చిత్రబృందం సంతోషంగా ఉంది.చెన్నై, ఢిల్లీలో తదుపరి షెడ్యూల్స్ షూటింగ్ జరపనున్నారు.

ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.ఈ షెడ్యూల్స్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయబోతున్నారు.

సత్యరాజ్, భారతీరాజా, సునీల్, తంబి రామయ్య, రెదిన్ కింగ్స్లే జీపీ ముత్తు, తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – డి ఇమాన్, సినిమాటోగ్రఫీ – విజయ్ చక్రవర్తి, ఎడిటింగ్ – ఆంటోనీ, ఆర్ట్ – ఉదయ్ కమార్, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత – థాయ్ శరవణన్, రచన దర్శకత్వం – సుసీంద్రన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube