కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) ఏ సినిమా చేసిన కూడా కోలీవుడ్ లో సంచలనమే.యావరేజ్ టాక్ వచ్చిన 200 కోట్లను కలెక్ట్ చేసే సత్తా ఉన్న స్టార్ విజయ్.
మరి అలాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ కు అక్కడ పెద్ద కష్టం వచ్చిందట.ఆల్మోస్ట్ ఈయన సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నారనే వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే.

విజయ్ తలపతి సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj )దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్నాడు.లోకేష్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రకటించినప్పటి నుండే భారీ డిమాండ్ ఉంది.ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అందరిని ఆకట్టుకోగా అంచనాలు సైతం పెరిగిపోయాయి.
ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష ( Trisha )హీరోయిన్ గా నటిస్తుందిగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ కానుంది.ఈ క్రమంలోనే అక్టోబర్ 5న ట్రైలర్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ అప్డేట్ అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ ఆకట్టుకుంది.

ఇదిలా ఉండగా ప్రెజెంట్ తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి జలాల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.ఈ గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు.కర్ణాటకలో నిరసనలు, బంద్ లు జరుగుతున్నాయి.
ఈ గొడవల కారణంగా తమిళ్ సినిమాలను కర్ణాటకలో బంద్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ ఎఫెక్ట్ విజయ్ లియో సినిమా మీద కూడా పడే అవకాశం ఉంది.
తమిళ్ సినిమాలు కర్ణాటకలో భారీ వసూళ్లు రాబడుతుంటాయి.మరి ఈ సమయంలో అన్ని బాగుండి ఉంటే లియో ( LEO Movie )సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చేవి.
కానీ ఇప్పుడు మొత్తానికే అక్కడ రిలీజ్ కష్టం అని అంటున్నారు.







