2011 ప్రపంచకప్‌లో ఆడిన సుమారు 10 మంది ఆటగాళ్లు ఇప్పుడు జరగబోతున్న ప్రపంచకప్ జట్టులో కనిపించనున్నారు.గత దశాబ్ద కాలంగా జట్టులో భాగమైన ఈ ఆటగాళ్లు.
మరోసారి తమ లక్‌ను పరీక్షించేందుకు రెడీ అయిపోయారు.ఇపుడు వారెవరో తెలుసుకుందాం.
ఇలిస్టులో మొదటగా “స్టీవ్ స్మిత్” గురించి తెలుసుకోవాలి.స్టీవ్ స్మిత్ 2011 ఆస్ట్రేలియా జట్టులో స్పిన్ ఆల్ రౌండర్‌గా కనిపించాడు.
ఈసారి అదే స్మిత్‌ను లీడింగ్ బ్యాట్స్‌మెన్‌గా జట్టులోకి తీసుకోవడం విశేషం.ఇక రెండవ వాడు “ఆదిల్ రషీద్.
” 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు యువ స్పిన్నర్‌గా కనిపించిన ఆదిల్ రషీద్.ఈసారి కూడా ఇంగ్లిష్ జట్టులోకి తెరంగేట్రం చేశాడు.

ఈ లిస్టులో ముచ్చటగా మూడవవాడు “వెస్లీ బరేసి” గురించి మాట్లాడుకుంటే, 2011లో నెదర్లాండ్స్ జట్టులో బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కించుకున్న వెస్లీ బరేసి ఇప్పుడు 39 ఏళ్ల వయసులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక కావడం గమనార్హం.అదేవిధంగా “షకీబ్ అల్ హసన్”( Shakib Al Hasan ) 2011 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టుకు నాయకత్వం వహించిన సంగతి విదితమే.ఈయన ఈసారి కూడా బంగ్లాదేశ్ జట్టుకు నాయకత్వం వహించడం విశేషం.ఇక “కేన్ విలియమ్సన్” గురించి తెలిసిందే.2011 ప్రపంచ కప్‌లో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ జట్టుకు యువ ఆటగాడిగా ఎంపికయ్యి ఇప్పుడు 2023 ప్రపంచకప్‌లో కివీస్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.

ఇక మన “రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin )” గురించి కూడా తెలిసిందే.ఇతగాడు 2011 ప్రపంచకప్‌లో కెప్టెన్ ధోనీ స్పిన్ ఆయుధంగా ఉపయోగించిన ఈ రవిచంద్రన్ అశ్విన్ 12 ఏళ్ల తర్వాత అనూహ్య పరిణామాలతో అనుభవజ్ఞుడైన ఆటగాడిగా భారత ప్రపంచకప్ జట్టులో చోటు సాధించడం విశేషం.ఈ క్రమంలోనే ముష్ఫికర్ రహీమ్, టిమ్ సౌతీ, మహ్మదుల్లా మరియు విరాట్ కోహ్లి ప్రపంచ కప్ ఆడబోతున్నారు.2011 వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ టీమిండియా తరపున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు.ఇప్పుడు భారత జట్టులోని ప్రముఖ బ్యాట్స్‌మెన్ 2023లో కనిపించనున్నాడు.







