హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నటీమణులలో విద్యా బాలన్( Vidyabalan ) ఒకరు.కెరీర్ తొలినాళ్లలో విద్యాబాలన్ సీరియల్స్ లో, మ్యూజిక్ వీడియోలలో నటించి మెప్పించారు.
కేరళలో జన్మించిన విద్యా బాలన్ సోషియాలజీలో డిగ్రీని పూర్తి చేశారు.హమ్ పాంచ్ అనే సీరియల్ తో ఈ నటి ప్రస్థానం మొదలైంది.
కెరీర్ తొలినాళ్లలో మలయాళంలో ఒక సినిమాకు ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపొయింది.
తాజాగా ఈ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
నా భర్తను ( Vidyabalan Husband ) చూసిన మొదటి చూపులోనే నాలో కామం పుట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.నా భర్త సిద్దార్థ్ అందగాడు అని మేమిద్దరం ఫిజికల్ గానే అట్రాక్ట్ అయ్యామని ఆమె కామెంట్లు చేశారు.
సిద్దార్థ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడని నా విషయంలో ఎంతో కేర్ తీసుకునేవాడని విద్యాబాలన్ పేర్కొన్నారు.

సిద్దార్థ్ ఎంతో ప్రైవేట్ గా ఉంటాడని నా తల్లీదండ్రులను సిద్దార్థ్ లో చూసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.సిద్దార్థ్ తో( Siddharth ) నాకు ఎమోషనల్ గా కనెక్షన్ ఉన్నా ఫిజికల్ గానే మేమిద్దరం దగ్గరయ్యామని ఆమె అన్నారు.విద్యాబాలన్ చేసిన బోల్డ్ కామెంట్స్ విని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇలాంటి విషయాలను విద్యాబాలన్ పబ్లిక్ లో చెప్పాల్సిన అవసరం లేదని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

విద్యాబాలన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.విద్యాబాలన్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.తెలుగులో కూడా అడపాదడపా ప్రాజెక్ట్ లలో విద్యాబాలన్ నటించారు.
విద్యాబాలన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.విద్యాబాలన్ బోల్డ్ కామెంట్స్ కు దూరంగా ఉండాలని ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







