నడిరోడ్డుపై బావిలా గుంత.. తప్పిన ముప్పు

భారీ వర్షాలకు రోడ్లు కుంగిపోవడం మనం చూస్తూ ఉంటాం.ఇలా రోడ్లు కుంగిపోవడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.

 A Hole Like A Well On The Road A Missed Threat , Road, Viral News, Viral Latest-TeluguStop.com

వాహనాలు వెళ్లడానికి వీలు పడదు.దీని వల్ల భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడటం జరుగుతూ ఉంటుంది.

తాజాగా ఢిల్లీలో( Delhi ) ఒక రోడ్డు కుంగిపోయింది.రోడ్డు కుంగిపోయి బావిలా ఒక పెద్ద గుంత ఏర్పడింది.

అయితే రోడ్డు కుంగిన సమయంలో అటుగా వాహనాలు ఏమీ వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

ఢిల్లీలోని రద్దీగా ఉండే జనక్‌పురి ప్రాంతంలో( Janakpuri ) బుధవారం తెల్లవారుజుమున ఉన్నట్లుండి ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది.ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు.రోడ్డు కుంగిపోయిన సమయంలో వాహనాలు స్పాట్‌లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.రోడ్డు కుంగిపోయి ఏకంగా పెద్ద గుంత ఏర్పడింది.దీంతో స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గుంతను పూడ్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు.ప్రస్తుతం ఒకవైపు నుంచే వాహనాలు( Vehicles ) వెళుతున్నాయి.

అయితే తెల్లవారుజామున ఘటన జరగడంతో వాహనదారుల రద్దీ ఏర్పడలేదు.కానీ రోడ్డు కుంగిపోయి పెద్ద బావిలా ఏర్పడింది.

ఒకవేళ కుంగిపోయే సమయంలో వాహనాలు వెళితే ప్రాణ నష్టం జరిగేది.ప్రస్తుతం కుంగిపోయిన ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

ఢిల్లీలో ఇటీవల కుండపోత వర్షాలు కురిశాయి.భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి.ఈ భారీ వర్షాలకు రోడ్లు కుంగిపోయినట్లు తెలుస్తోంది.ఇలాగే పలు ప్రాంతాల్లో కూడా రోడ్లు కుంగిపోయినట్లు తెలుస్తోంది.దీంతో రోడ్లను పునరుద్దరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తోన్నారు.కొన్నిచోట్ల మరమ్మత్తులు చేయడానికి ఆలస్యం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube