ఒకప్పుడు పుస్తకాలు చదవాలంటే లైబ్రరీకి వెళ్లడమో లేదా బుక్ స్టోర్‌కి వెళ్లి బుక్స్ కొనుగోలు చేసి ఇంట్లో చదువుకోవడమో చేసేవారు.కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఈ-బుక్స్( E-books ) వచ్చేశాయి.
స్మార్ట్‌ఫోన్‌లోనూ లేదా డెస్క్‌టాప్‌లోనూ బుక్స్ చదువుకోవచ్చు.కొన్ని వెబ్‌సైట్లు ఇందుకోసం కొంత మొత్తంలో డబ్బులు తీసుకుంటాయి.
ఉచితంగా బుక్స్ చదువుకునే వెసులుబాటు ఉన్న వెబ్‌సైట్లు( Websites ) కూడా చాలానే ఉన్నాయి.పీడీఎఫ్ రూపంలో సులువుగా చదువుకునేలా ఈ-బుక్స్‌ను చాలా వెబ్‌సైట్లు అందిస్తున్నాయి.

అయితే తాజాగా ఈ-బుక్స్ చదివేవారికి గుడ్‌న్యూస్ అందింది.మొబైల్ ఫోన్లలో లేదా ట్యాబ్‌లలో బుక్స్ చదివేటప్పుడు కళ్లపై ఒత్తిడి పడుతుంది.దీంతో కళ్లను రక్షించుకునేందుకు ఈ-బుక్ రీడర్ కళ్లజోడు( E-book reader glasses ) త్వరలో మార్కెట్‌లోకి రాబోతుంది. సోల్ రీడర్ ( Soul Reader )అనే కంపెనీ ఈ సరికొత్త కళ్లజోడును తయారుచేసింది.
ఆన్‌లైన్‌లో బుక్స్ ఎక్కువగా చదివేవారి కోసం తయారుచేసింది.ఈ కళ్లజోడు చలువ కళ్లద్దాలను పోలి ఉంటుంది.
ఈ కళ్లజోడు ధరిస్తే అక్షరాలు తప్ప మరేవి కనిపించవు.దీని వల్ల ఏకాగ్రత కూడా పెరగడం వల్ల ఎంతసేపైనా బుక్ చదువుకోవచ్చు.

అలాగే కంటి చూపుకు తగ్గట్లుగా ఈ కళ్లజోడు ద్వారా అక్షరాలను మార్చుకోవచ్చు.దీని కోసం ప్రత్యేకంగా కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు( Contact lenses, spectacles ) పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదని చెబుతున్నారు.ఈ-బుక్స్ రీడర్ కళ్లజోడు కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.ఇక ఈ కళ్లజోడు ధరించడం వల్ల బెడ్‌పై పడుకుని కూడా బుక్ చదువుకోవచ్చు.
ఈ కంపెనీ ఒక రిమోట్ ఇస్తుంది.ఈ రిమోట్ ద్వారా మనకు కావాల్సిన పేజీని సెట్ చేసుకోవచ్చు.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 30 గంటల పాటు వాడుకోవచ్చు.దీని ధరల 350 డాలర్లు ఉంటుందని చెబుతున్నారు.







