వీడియో: బైకర్‌ను వెంబడించిన రెండు చిరుతలు.. చివరికి ఏమైందో అస్సలు ఊహించలేరు..

పుణె జిల్లాలోని షిరూర్ తాలూకాలో (Shirur Taluk ,Pune District)ఇటీవల జరిగిన ఓ భయానక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనలో రెండు చిరుతపులులు ఒక మోటర్‌సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెంబడించాయి.

ఈ వణుకు పుట్టించే దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.ఈ వీడియోలో ఒక బైకర్ చాలా స్లోగా రహదారి పైన వెళ్తుండటం చూడవచ్చు.

అయితే కొంతసేపటికి అతని వెనకే రెండు పెద్ద చిరుతపులులు (Leopards)పడటం కనిపించింది.వీడియో ఆఖరిలో ఏం జరిగిందో తెలియ రాలేదు.

ఆ రెండు పులులు ఆ బైక్ రైడర్‌ను వెంబడించి కింద పడేసి చంపేశాయా? ప్రస్తుతానికైతే లోకల్ మీడియా ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని చెబుతోంది.దీన్ని బట్టి అతను ఎస్కేప్ అయినట్లు అర్థమవుతుంది.

Advertisement

ఏదేమైనా ఈ వీడియో చూస్తుంటేనే చాలా భయమేస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే షిరూర్, జున్నార్,(Shirur, Junnar) సమీప ప్రాంతాల ప్రజలు ఈ చిరుతపులి దాడుల కారణంగా భయాందోళనకు గురవుతున్నారు.

ఈ ప్రాంతంలో చిరుతపులులను చూసిన, దాడి చేసిన సంఘటనలు పెరుగుతుండటంతో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.ముఖ్యంగా రాత్రి, ఉదయం పూట ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.

ఈ ప్రాంతంలో భద్రతను మెరుగుపరచాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.షిరూర్ తాలూకాలోని మండవగన్ ఫరతా గ్రామంలో చిరుతపులి దాడిలో ఏడు సంవత్సరాల బాలుడు వంశ్ రాజ్‌కుమార్ సింగ్ మృతి చెందాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్(Muzaffarnagar ,Uttar Pradesh) నుంచి పని కోసం షిరూర్‌కు వచ్చిన వంశ్ కుటుంబం ఒక చెక్కర తయారీ యూనిట్‌లో పనిచేస్తున్నారు.అక్టోబర్ 18వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో గొడవ అయ్యాక ఇంటి నుండి బయటకు వచ్చిన వంశ్ చెరకు తోట వైపు వెళ్లాడు.

ఇదేందయ్యా ఇది.. బావిలో నీరు కోసం వెళ్తే పెట్రోల్ వస్తోంది
వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)

అక్కడే చిరుతపులి దాడి చేసి చంపింది.ఫ్యాక్టరీ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయం కోరేసరికి వంశ్‌ను కాపాడడానికి ఆలస్యమైంది.

Advertisement

ఈ ఘటన తర్వాత స్థానికులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.మరింత భద్రత కల్పించి చిరుతపులి దాడులను నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో ప్రజలు భయభీతులై, అభద్రతా భావనతో జీవిస్తున్నారు.

తాజా వార్తలు