సెల్ఫీల మోజులో పడి తీవ్రమైన గాయాలు పాలవుతున్నారు ప్రజలు కొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు.వీటి వల్ల వచ్చే లాభం ఏమీ లేదు కానీ జరిగే నష్టాలు ఎక్కువ.
ప్రయాణాలు ఇంకా ప్రకృతి వైపరీత్యాల మధ్య సెల్ఫీలు తీసుకుని ఫ్రెండ్స్ ముందు షో చేయాలని చాలామంది అనుకుంటున్నారు.చివరికి ఇవే వారి కొంప ముంచుతాయని విషయాన్ని అసలు లెక్కచేయడం లేదు.
తాజాగా ఒక మహిళ, భారీ అలల దాడిలో చిక్కుకున్నప్పటికీ, వాటితో పోరాడుతూ సెల్ఫీ దిగింది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.
అది చూసి చాలా మంది కంగు తింటున్నారు.
వీడియో ప్రకారం ఏం జరిగిందంటే ఒక మహిళ, బురదతో నిండిన గడ్డి భూమిపై నిలబడి, సెల్ఫీ స్టిక్( Selfie stick ) పట్టుకుని ఫోటో తీసుకుంటోంది.ఆమె వెనుక, భారీ అలలు దగ్గరగా వస్తుండగా, ఇద్దరు పురుషులు భయంతో పరుగులు తీస్తారు.పారిపోయే లోపే, బురదతో కూడిన భారీ అలలు ఆ మహిళతో సహా ఆ ఇద్దరు పురుషులను కూడా ముంచెత్తుతాయి.
ఆమె ఒక్కసారిగా కింద పడిపోతుంది.ఈ ఘటన చాలా ధైర్యసాహసాలతో నిండి ఉంది.
భారీ అలల దాడిలో చిక్కుకున్నప్పటికీ, ఆ మహిళ ధైర్యాన్ని కోల్పోకుండా సెల్ఫీ దిగడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది.
భార్య అలలు ముంచెత్తినా ఆమె ధైర్యం చెక్కుచెదరలేదు.కెమెరాను గట్టిగా పట్టుకుని, ముందుకు వస్తున్న భయంకర దృశ్యాలను రికార్డ్ చేస్తూనే ఉంది.చిన్న చిన్న అరుపులతో ఆమె భయంకర పరిస్థితిని ఆస్వాదిస్తున్నట్లు కనిపించింది.
ఆమెను రక్షించడానికి ఇద్దరు పురుషులు చాలా కష్టపడి ఆమెను లాగుతున్న దృశ్యంతో వీడియో ముగిసింది.ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు.
ఈ వీడియోకు మహిళ సునామీ( Tsunami )తో సెల్ఫీ తీసుకుంది అని ఒక క్యాప్షన్ జోడించారు.సోషల్ మీడియాలో ఈ ఘటనపై విభిన్న రకాల ప్రతిస్పందనలు వచ్చాయి.
క్షణాన్ని ఆస్వాదించడం, కెమెరాను కాపాడుకోవడం కోసం ఆమె చూపించిన ధైర్యాన్ని కొందరు ప్రశంసించగా, మరికొందరు ఆమె ప్రమాదకర ప్రవర్తనను విమర్శించారు.ఏది ఏమైనా, సునామీతో సెల్ఫీ తీసుకోవడం ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించింది.