భారత ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబైలో( Mumbai ) ప్రజలు అనునిత్యం ఉరుకులు పరుగులు తీస్తుంటారు.కిక్కిరిసిన వాహనాల్లో ఎక్కి ఉద్యోగాలకు వెళ్తుంటారు.
ఈ సిటీలో ట్రైన్లలో( Trains ) ప్రయాణించే వారి సంఖ్య డైలీ దాదాపు కోటి దాక ఉంటుంది.స్కూల్, వర్క్ ఆఫీస్, ఇంకా తదితర ముఖ్యమైన పనులకు వెళ్లే వారితో ముంబై రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే బిజియస్ట్ రైల్వే నెట్‌వర్క్‌గా నిలుస్తోంది.
ఈ సిటీలో పీక్ అవర్స్‌లో ట్రైన్‌లలో సీట్ దొరకడం దాదాపు అసాధ్యం.అందుకే కదులుతున్న ట్రైన్ ఎక్కి సీట్ పొందేందుకు చాలామంది మొగ్గు చూపుతుంటారు.
వెన్నతో పెట్టిన విద్యగా చాలా వేగంగా వెళుతున్న ట్రైన్ సులభంగా ఎక్కిస్తుంటారు.
ఇప్పటికే ఫాస్ట్‌గా వెళ్లే ట్రైన్ ఎక్కి కొందరు మగ ప్రయాణికులు వైరల్ అయ్యారు.
అయితే మగవారు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా వారికి దీటుగా కదులుతున్న రైలు( Moving Train ) ఎక్కగలరని చూపించే ఒక వీడియో వైరల్ గా మారింది.ఇందులో కొందరు యువతులు వేగంగా వెళ్తున్న ట్రైన్ లోని బోగీలోకి చాలా సునాయాసంగా ఎక్కడం కనిపించింది.
దానికి సంబంధించిన వీడియోను @theskindoctor13 అనే X యూజర్ షేర్ చేశారు.

ఈ వీడియో క్లిప్‌లో 20 నుంచి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న యువతులు కొంచెం కూడా భయపడకుండా కదులుతున్న ముంబై లోకల్ ట్రైన్‌లోకి( Mumbai Local Train ) ఒకరి తర్వాత ఒకరు ఎక్కుతున్నట్లు చూడవచ్చు.సెప్టెంబరు 16న షేర్ చేసిన ఈ వీడియోలో ఈ లేడీ ప్యాసింజర్లు కోచ్‌లో సీటు పొందడానికి తమ సేఫ్టీని ఎలా పక్కన పెట్టేసారో గమనించవచ్చు.రైలు లోపలికి అడుగుపెట్టేముందు ఆ యువతులు బ్యాలెన్స్‌ని ఎంత కష్టంగా ఆపుకోగలిగారో వీడియోలో కనిపించింది.
అయితే ఏమాత్రం తేడా వచ్చినా వారి ప్రాణాలకే ప్రమాదం.అయినా ఈ లేడీస్ బోగీలోకి జంపులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.

రద్దీగా ఉన్న ఈ ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తుల వీడియో క్లిప్‌కు ఒక ఆలోచింపజేసే క్యాప్షన్ పెట్టారు యూజర్.“ఇది సాధారణ ముంబైవాసుల విచారకరమైన, భయానక, నాసిరకం జీవనం.సౌత్ బొంబాయిలో సుఖంగా జీవిస్తున్న సంపన్నులు దీనిని “స్పిరిట్ ఆఫ్ ముంబై”గా గ్లామరైజ్ చేస్తారు, తద్వారా వారు మెరుగైన మౌలిక సదుపాయాలను అడగరు.” అని ఒక క్యాప్షన్ జోడించారు.నెటిజన్లు ఈ వీడియోపై మిశ్రమ కామెంట్లు చేశారు.







