Vijayalakshmi :లైంగిక వేదింపుల కేసులో పోలీసులకు షాక్ ఇచ్చిన నటి.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం సోషల్ మీడియా( Social media )లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో విజయలక్ష్మి, సీమాన్‌ పేర్లు కూడా ఉన్నాయి.అయితే ఇటీవల శాండల్‌వుడ్ విజయలక్ష్మి నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

 Actress Vijayalakshmi Harassment Case Seeman-TeluguStop.com

అతని వల్ల ఏడుసార్లు అబార్షన్ అయ్యింది అంటూ ఫిర్యాదు చేశారు.అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైతం దర్యాప్తు వేగవంతం చేశారు.

అయితే ఈ కేసు ఊహించని విధంగా మలుపులు తిరిగింది.సీమాన్‌పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకున్నట్లు వెల్లడించింది.

అయితే ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.సీమాన్‌( Seeman ) పలుమార్లు అబార్షన్లు చేయించారని ఆరోపిస్తూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు నిర్వహించారు.

Telugu Seeman, Tollywood-Movie

కాగా సీమాన్‌ తనను వాడుకుని మోసం చేసినట్టుగా దశాబ్దం కాలంగా విజయలక్ష్మి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ కేసులో సీమాన్ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో విజయలక్ష‍్మి ఊహించని విధంగా పోలీసులకు షాక్ ఇస్తూ యూటర్న్ తీసుకుంది.వలసర వాక్కం పోలీసు స్టేషన్‌లో కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా వినతి పత్రం సమర్పించింది./br>

Telugu Seeman, Tollywood-Movie

ఓ సంస్థకు చెందిన వీరలక్ష్మి పర్యవేక్షణలో తాను గృహ నిర్భంధంలో ఉన్నట్టుగా గత కొద్ది రోజులుగా పరిణామాలు చోటు చేసుకున్నాయని విజయలక్ష‍్మి( Vijayalakshmi ) అన్నారు.ఇవి తనను ఎంతగానో బాధించాయని పేర్కొన్నారు.సీమాన్‌ సూపర్‌ అని.ఆయన పవర్‌ ఫుల్‌ అని కామెంట్స్ చేశారు.ఆయన్ని ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరని.తాను మళ్లీ ఇక్కడికి రాబోనని, బెంగళూరు వెళ్లి పోతున్నట్లు విజయలక్ష‍్మి పేర్కొన్నారు.సీమాన్‌ పవర్‌ ముందు తాను ఓటమిని అంగీకరించి వెళ్తున్నానని అన్నారు.అతను బాగుండాలని.

రాజకీయంగా మరిన్నీ విజయాలు సాధించాలని కోరుకున్నారు.తాను సీమాన్‌ వద్ద ఎలాంటి నగదు, మరే ఇతర తాయిలాలు తీసుకోలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube