Cow Hospital : వీడియో: ఆసుపత్రి లోపలికి వచ్చిన ఆవు.. ఈ సీన్ చూస్తే నవ్వాగదు..

ఆసుపత్రిలో మంచి వాతావరణాన్ని నెలకొల్పడం అక్కడి సిబ్బంది ప్రధాన బాధ్యత.కుక్కలు, బర్రెలు, ఆవులు రాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వారికి ఉంది.

 Video  A Cow Entered The Hospital , Cow, District Hospital, Madhya Pradesh, Rajg-TeluguStop.com

కానీ ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులలో అలాంటి బాధ్యతను నిర్వర్తించేవారు చాలా తక్కువ మంది అని తెలుస్తోంది.తాజాగా ఒక హాస్పటల్ స్టాఫ్ చేసిన నిర్లక్ష్యం వల్ల ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

అదేంటంటే, ఒక ఆవు తాపీగా ఆసుపత్రిలోకి ఎంట్రీ ఇచ్చి ఎంచక్కా చక్కర్లు కొట్టింది.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లోని జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

ఆవు హాస్పటల్‌లో తిరుగుతున్న వీడియో శనివారం వైరల్‌గా కూడా మారింది.దాంతో అప్రమత్తమైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు.

ముగ్గురు సిబ్బంది, ఒక సెక్యూరిటీ గార్డును తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.ఈ సంఘటన శుక్రవారం జరిగినట్లు సమాచారం.30 సెకన్ల నిడివి గల వైరల్ వీడియోలో రోగులు ఉన్న ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఆవు షికారు చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.ఆసుపత్రిలో వార్డ్ బాయ్ లేడు, ఆవు హాయిగా తిరుగుతోందని వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి చెబుతుండగా, చివరకు దానిని ఒక వ్యక్తి తరిమి కొట్టాడు.

ఈ వీడియో చూసిన ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే మరోవైపు నవ్వుకుంటున్నారు.ఆవుకు ఏదో అనారోగ్య సమస్య వచ్చినట్లుంది అందుకే ఇది డైరెక్ట్ గా ఐసీయూ వాటిలోకే వెళ్లిపోయింది అని ఒక యూజర్ ఫన్నీగా కామెంట్ చేశాడు.

“నేను పరిస్థితిని గమనించి, వార్డ్ బాయ్.సెక్యూరిటీ గార్డుపై చర్యలు తీసుకున్నాను.ఈ సంఘటన ఒక ఐసీయూ వార్డులో జరిగింది” అని జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర కటారియా తెలిపారు.ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆవులను పట్టేవారిని ఆసుపత్రిలో మోహరించినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకుందని నివేదికలు పేర్కొన్నాయి.

మరోవైపు ఈ ఏడాది సెప్టెంబరులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లాలో ఇలాంటి ఒక సంఘటనే చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఒక ఆసుపత్రి బెడ్‌పై ఓ వీధి కుక్క హాయిగా పడుకుంది.

దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube