మోస్ట్ యూజ్‌ఫుల్ ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడే ఫోన్లలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లే ఎక్కువగా ఉంటాయని అనడంలో సందేహం లేదు.

ఇవి తక్కువ ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం.

తక్కువ ధరల్లో లభించినా ఇవి చాలా ఎక్కువ ఫీచర్లతో వస్తాయి.ఈ ఫీచర్స్ సహాయంతో ఎన్నో యాప్స్ వాడుకుంటూ స్మార్ట్‌ఫోన్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ పొందొచ్చు.

అయితే ప్రస్తుతం ఐదు యాప్‌లు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బాగా ఉపయోగకరంగా కనిపిస్తున్నాయి.అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1.గూగుల్ ఫైల్స్

గూగుల్ ఫైల్స్ యాప్‌ మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫైల్ చాలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.అలానే ఫైల్స్‌ను చాలా వేగంగా బ్రౌజ్ చేస్తూ డివైజ్‌ స్టోరేజీని సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా పాత, అనవసరమైన ఫైల్స్, జంక్ ఫైల్స్ సింపుల్ గా క్లియర్ చేసుకొని డేటా స్పేస్ సేవ్ చేసుకోవచ్చు.డూప్లికేట్ ఫైల్‌లను కూడా దీని సహాయంతో డిలీట్ చేయడం చాలా సులభం.

2.ఇంటర్నెట్ స్పీడ్ మీటర్

Advertisement

మీ మొబైల్ పొందుతున్న డేటా స్పీడ్‌ను చెక్ చేసుకునేందుకు ఇంటర్నెట్ స్పీడ్ మీటర్ లైట్ యాప్ బాగా ఉపయోగపడుతుంది.ఈ యాప్ సైజ్ 2-3MB మాత్రమే కాబట్టి దీనిని డౌన్‌లోడ్ చేసుకొని చాలా బెనిఫిట్స్ పొందొచ్చు.దీని సహాయంతో ఇంటర్నెట్ డేటా మేనేజ్మెంట్ సులభం అవుతుంది.

3.కీప్ నోట్స్

కీప్ నోట్స్ యాప్ ఒక డిజిటల్ డైరీలా పనిచేస్తుంది కాబట్టి దీనిని అందరూ తప్పక డౌన్‌లోడ్ చేసుకోవాలి.కీప్ నోట్స్‌లో పాస్‌వర్డ్స్, ఇంపార్టెంట్ విషయాలు, ఇంకా చాలా వివరాలను రాసుకొని ఉంచుకోవచ్చు.దీనిలో చెక్ లిస్ట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు అవసరమైన వస్తువుల లిస్ట్‌ను కూడా ఇందులో రాసుకోవచ్చు.టెక్స్ట్ మాత్రమే కాకుండా ఫొటోలు కూడా దీనిలో సేవ్ చేయవచ్చు.

4.హమ్మర్ సెక్యూరిటీ యాప్

హమ్మర్ సెక్యూరిటీ యాప్ సహాయంతో దొంగతనానికి గురైన మీ ఫోన్‌ను ట్రాక్ చేయవచ్చు.అలానే దీనిలో లభించే డమ్మీ స్విచ్ ఆఫ్, ఫేక్ ఫ్లైట్ మోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లతో నీ ఫోన్ దొంగలించిన వ్యక్తిని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది.

డిసెంబర్ 31 లోపు అలా చేయాల్సిందే.. పాన్ కార్డ్ కొత్త రూల్స్..
Advertisement

తాజా వార్తలు